రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో విస్పష్టంగా పేర్కొనటం.. దానికి బీజేపీ నేతలు సైతం అంగీకరించటం చారిత్రక సత్యం. కట్ చేస్తే.. 2019 ఎన్నికల ప్రచారంలో ఇప్పటి ప్రధాని మోడీ సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని వ్యాఖ్యానించటం వాస్తవం. ఇవన్నీ చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. చరిత్రలో రికార్డు అయిన సత్యాలు. తిరుగులేని విజయంతో కళ్లు నెత్తిన వచ్చిన వేళ.. మోడీ సర్కారు మాట పూర్తిగా మారిపోవటం.. దానికి తగ్గట్లే.. అప్పటి అవసరాల కోసం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రత్యేక హోదాకు దెబ్బ పడేలా చేసిందన్నది వాస్తవం.
ప్రత్యేక హోదా మీద తొండి వాదన వినిపించటం మొదలు పెట్టిన నాటి నుంచి ఎప్పటికప్పుడు దీని గురించి చిత్రవిచిత్రంగా మాట్లాడే మోడీ ప్రభుత్వాధినేతలు.. తాజాగా అదే తీరును ప్రదర్శించారు. తాజాగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా మీద ఒక ప్రశ్నను సంధించారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నీతి అయోగ్ తో జరిపిన సమావేశంలో విన్నవించారన్నారు.
అయితే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందన్నారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కోరిన మీదట రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్న మాటను చెప్పారు.
ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల్ని నెరవేర్చే బాధ్యత ఉన్నందున.. ఏపీ డెవలప్ మెంట్ కు సాయపడాలని ఆర్థిక సంఘాలు.. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేసినందున ఏపీకి అవసరమై సాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా 2015-20 వరకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఇస్తూనే ఉందని పేర్కొన్నారు.
తాము చెప్పినట్లే ఐదేళ్ల వ్యవధిలో రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.22,112కోట్లు.. 2020-21లో రూ.5897 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. అంటే.. ఆరేళ్ల వ్యవధిలో ప్రత్యేక హోదాకు బలి పెట్టినందుకు ఏపీకి వచ్చింది రూ.27వేల కోట్లు (కాస్త ఎక్కువగా) మాత్రమే. ఇంతకు మించిన అన్యాయం ఇంకేం ఉంటుంది. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం.. దాన్ని భర్తీ చేసేందుకు ఇస్తామన్న ప్రత్యేక హోదాను బలి తీసుకుంటూ.. ముష్టి రూ.30వేల కోట్ల కంటే తక్కువ ఇచ్చి.. చాలా చేసినట్లు చెప్పుకోవటానికి మించిన తొండి ఇంకేం ఉంటుంది చెప్పండి.