కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి కోపం వచ్చేసింది. గతంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా పెద్దగా స్పందించని ఆయన.. తాజాగా రాహుల్ భారతీయుడు కాదని.. బ్రిటీషర్ అని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి చేసిన ఆరోపణలపై స్పందించారు. ప్రస్తుతం అధికారంలో మోడీ సర్కారు ఉందని.. ఆయన కోరుకుంటే.. ఏ విషయం మీదనైనా దర్యాప్తు జరపటానికి అధికారులు సిద్దంగా ఉంటారని.. అలాంటప్పుడు తనపై ఆరోపణలు చేసే కన్నా.. తనను అరెస్ట్ చేయాలని సవాలు విసిరారు.
గురువారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గతంలోనూ తన మీద చాలానే ఆరోపణలు చేశారని.. ఇలా ఆరోపణలు చేసే కన్నా.. అధికారంలో చేతిలో ఉన్న మోడీ సర్కారు తనపై దర్యాప్తు జరిపి.. తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయాలన్నారు. రాహుల్ పై గతంలో తప్పుడు డిగ్రీ కలిగి ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తనపై వచ్చే ఆరోపణలకు తాను బయపడనని.. అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి.. రాహుల్ వ్యాఖ్యలపై సుబ్రమణ్యస్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి?