అంచనాలకు మించినట్లుగా రెండుసార్లు తిరుగులేని అధిక్యతతో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. తాజాగా మరో లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా ప్లాన్ సెట్ చేస్తోంది. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు సమకాలీన భారతంలో మరే ప్రధాని మంత్రికి లేని రికార్డును తన సొంతం చేసుకోవటానికి మోడీ తపిస్తున్నారు. అందుకే తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాతో కలిసి సరికొత్త ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. అదే టార్గెట్ 144.
వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. గతంలో బీజేపీకి దన్నుగా నిలిచిన గుజరాత్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో ఈసారి వచ్చేఎంపీ సీట్ల సంఖ్య తగ్గే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గడిచిన కొన్నేళ్లుగా గుజరాత్ లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీకి ఈసారి మాత్రం అందుకు భిన్నమైన అనుభవం తప్పదన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ఈసారి కొత్త సీట్ల మీద కన్నేసినట్లుగా చెబుతున్నారు.
లోక్ సభలో మొత్తం 543 స్థానాలకు 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. మిత్రపక్షాలతో కలిపి ప్రస్తుతం 332 స్థానాల బలంతో తిరుగులేని స్థానంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు వచ్చే ఎన్నికల్లో (2024)లో ఇప్పుడున్న సీట్లలో కచ్ఛితంగా 50 - 70 స్థానాలు దెబ్బేయటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే.. ఇప్పటివరకు తాము ఎప్పుడు విజయం సాధించని 144 స్థానాల్ని తాజాగా గుర్తించటమే కాదు.. ఆ 144 నుంచి తాము కోల్పోయే ఛాన్సు ఉన్న 50-70స్థానాల్ని రికవరీ చేసుకోవాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లుగా చెబుతున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఈ ప్లాన్ లో భాగంగా ఇప్పటివరకు మిత్రపక్షాల మీద ఫోకస్ చేయని మోడీషాలు ఇప్పుడుకలిసి వచ్చే పార్టీల కోసం వెతుకులాట షురూ చేస్తున్నట్లు చెబుతున్నారు. మిత్రులను కలుపుకొని వారి బలానికి మోడీ ఇమేజ్ ను జత చేర్చి.. ఆయా సీట్లలో గెలుపును సొంతం చేసుకోవటం ద్వారా 2024లో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ప్లానింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
కొత్తపార్టీలను తమ మిత్రపక్షాలుగా చేర్చుకునే ఆపరేషన్ వచ్చే ఏడాది మొదట్లో మొదలుపెట్టనున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు తమతో ఉన్న మిత్రపక్షాలకు ఏదో రకంగా హ్యాండిచ్చిన మోడీషాలు.. ఇప్పుడు తమ అవసరం కోసం స్నేహహస్తాన్ని చాటే వేళ.. ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.