ఏపీలో ఎన్నికల ఫలితాలు వైకాపాకు స్పష్టమైన మెజార్టీని చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ని సీఎంని చేశారని వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసునిగా జగన్ కి ప్రజలు ధైర్యసాహసాలతో పాటు గెలుపుని ఇచ్చారని అన్నారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని అన్నారు.
నమ్మకాన్ని నిజం చేసిన ప్రజలకు కచ్చితంగా మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అంటూ మంచు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ముంగిట ఏపీ ప్రభుత్వంపై మంచు మోహన్ బాబు కుటుంబం వార్ నడిపించిన సంగతి తెలిసిందే. తిరుపతి శ్రీ విద్యానికేతన్ స్కాలర్ షిప్ లు ఇచ్చేందుకు వెనకాడిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు నిరసనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వైకాపాలో చేరి జగన్ వెంట నడిచారు. మోహన్ బాబు సహా మంచు విష్ణు.. మనోజ్ సైతం వైకాపాకు మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని మోహన్ బాబు ఆశీస్సులు అందించిన సంగతి తెలిసిందే. ఏపీ శాసనసభకు లోకసభకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న ఏపీలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తేదేపా-వైకాపా-జనసేన మధ్య ముక్కోణపు పోటీలో వైకాపా స్పష్టమైన మెజారిటీతో దూసుకెళుతోంది. నేటి ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వైకాపా హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.