రెండే రెండు బంతులు.. మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేయటమే కాదు.. హీరో కావాల్సినోడు విలన్ గా మారిపోవటమే కాదు.. తన జీవితాంతం ఆ రెండు బంతులు తనకు పీడకలగా మారతాయని గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ ఎప్పుడూ ఊహించి ఉండరు. చెన్నై జట్టుతో జరిగిన ఐపీఎల్ 16 ఫైనల్ పోరులో చివరి రెండు బంతులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేయటమే కాదు.. అప్పటివరకు విజేతగా నిలుస్తుందని ఆశించిన గుజరాత్ జట్టుకు బదులు చెన్నై జట్టు విజేతగా నిలవటం తెలిసిందే. మోహిత్ వేసిన చివరి ఓవర్ అతని కెరీర్ కు అత్యంత ఖరీదైనదిగా మారిందని చెప్పాలి.
మ్యాచ్ జరిగిన రాత్రి తనకు నిద్ర పట్టలేదని.. కాస్త విభిన్నంగా తాను బంతుల్ని సంధించి ఉంటే బాగుండేదన్న ఆలోచనలతోనే రాత్రంతా గడిపినట్లుగా పేర్కొన్నారు. చివరిఓవర్ లో చెన్నైజట్టు విజయం సాధించటానికి 13 పరుగులు అవసరం. ఈ సందర్భంలో మోహిత్ శర్మ చేతికి బంతిని ఇచ్చారు.
నాలుగు బంతుల వరకు కట్టడిగా వేసిన మోహిత్.. ఐదో బంతిని సంధించినంతనే చెన్నై బ్యాటర్ రవీంద్ర జడేజా సిక్సర్ బాదటం.. ఆ తర్వాతి బంతిని ఫోర్ కు తరలించటంతో గుజరాత్ జట్టు వర్గీయులు దిగాలు పడిపోతే.. చెన్నై అభిమానులు పండుగ చేసుకున్నారు. దీంతో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఐదోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకన్న రికార్డును ముంబయి జట్టుతో సమానంగా రాసుకుంది.
ఇంతకీ మొదటి నాలుగు బంతుల్లో జరగని పొరపాటు.. చివరి రెండు బంతుల్లో ఏం జరిగింది? అసలేమైంది? ఫైనల్ పోరు కోసం అతను చేసిన ప్రాక్టీస్.. చివరి ఓవర్లో బాల్ సంధించటానికి వచ్చే అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకున్న దానికి బోలెడంత శ్రమ చేసి.. ప్లాన్ చేసుకున్నప్పటికీ..జడేజా అద్భుత బ్యాటింగ్ దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. చివరి ఓవర్ గురించి మోహిత్ ఒక చానల్ లో వివరంగా మాట్లాడాడు. అసలేం జరిగింది?ఎక్కడ తప్పు జరిగిందన్న విషయాన్ని వివరించాడు.
ఇంతకీ మోహిత్ ఏం చెప్పాడన్నది చూస్తే.. ''ఇలాంటి ఓవర్ వేసేందుకు చాలా క్లారిటీతో ఉన్నా. నెట్స్ లో కూడా చాలానే ప్రాక్టీస్ చేశా. అన్నిబంతుల్నియార్కర్లుగా వేస్తానని ముందే చెప్పా. చివరి రెండు బంతులు వేయటానికి ముందు జట్టు సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా యార్కర్ వేయనున్నట్లు చెప్పా. మొదటి నాలుగు బంతులు అనుకున్న విధంగానే వేశా. ఐదో బంతిని యార్కర్ గా వేద్దామని ప్రయత్నించా. కానీ..బంతి అనుకున్న చోట పడలేదు. రవీంద్ర జడేజా దాన్ని సిక్సర్ గా మలిచాడు. చివరి బంతిని లెగ్ వికెట్ యార్కర్ గా ప్రయత్నించా.. అది కాస్తా విఫలం కావటంతో బంతిని బౌండరీకి తరలించాడు. విజయం కోసం శాయశక్తులా పని చేసినా ఫలితం రాలేదు. ఆ రాత్రంతా నిద్ర పోలేదు'' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తన పని విషయంలో తాను ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పే మోహిత్ శర్మ మాటలకు తగ్గట్లే అతని చేతలు ఉన్నాయని చెప్పాలి. తాజా ఐపీఎల్ సీజన్ లో మొత్తం 14 మ్యాచుల్లో మోహిత్ 27వికెట్లు తీశాడు. అంతేకాదు.. టోర్నీ మొత్తంలోనూ అత్యంత తక్కువ సగటు (వేసిన బంతులు వర్సెస్ ఇచ్చిన పరుగులు) కూడా తక్కువే. అతని సగటు కేవలం 13.37 మాత్రమే అయినప్పటికీ.. అతనికి మాత్రం అనుకున్న ఫలితం రాలేదు. కొన్నిసార్లు ఎంతలా ప్రయత్నించినా ఫలితం సానుకూలంగా రాదన్న దానికి మోహిత్ ఉదాహరణగా నిలుస్తారని చెప్పాలి.