గుజరాత్ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలోని మోర్బీ జిల్లాలో వంతెన కూలిన ఘటన.. రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈఘటనలోల మొత్తం 140 మంది పైగానే మృతి చెందారు. వెంటనే ప్రధాని మోడీ కూడా ఇక్కడ పర్యటించి, బాధితులకు ఊరటనిచ్చే పని ప్రారంభించారు. అయితే, ఈ వివాదం అంతా కూడా వంతెనను రీస్ట్రక్చర్ చేసిన ఒరేవా కంపెనీ చుట్టూనే తిరుగుతోంది. గోడగడియారాలు తయారు చేసే కంపెనీకి దీనిని ఎలా అప్పగించారంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీనిపై కోర్టులోనూ కేసులు పడ్డాయి. అయితే.. దీనిని దేవుడు చేసిన పని(యాక్ట్ ఆఫ్ గాడ్) అని ఒరేవా కంపెనీ మేనేజర్ వాదించారు. ఈ విషయాన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కోర్టుకు తెలిపారు.
దేశాన్ని షాక్కు గురిచేసిన, 140 మంది ప్రాణాలు మింగేసిన ఈ ప్రమాదానికి కారణం.. `యాక్ట్ ఆఫ్ గాడ్` అని పేర్కొనడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. విచారణ ముగిసిన అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్ ఎస్ పాంచల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఒరేవా కంపెనీ ఇద్దరు మేనేజర్లలో ఒకరు ఈ ఘటనకు యాక్ట్ ఆఫ్ గాడ్ కారణమని చెప్పారు' అని వివరించారు. మరోవైపు, విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేబుల్ బ్రిడ్జి తీగలు పూర్తిగా తుప్పుపట్టిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ప్రజల సందర్శనార్థం తెరిచేందుకు వంతెన అసలు సిద్ధంగానే లేదని న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ తెలిపారు.
"వంతెన తీగలు తుప్పుపట్టాయని ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నివేదికలో దర్యాప్తు అధికారి వెల్లడించారు. తీగలు చాలా పాతబడిపోయాయి. వంతెన ఫ్లోరింగ్ మార్చి.. తీగలను పట్టించుకోకుండా వదిలేశారు. వాటిని అసలు మార్చేయలేదు. తీగలకు కనీసం ఆయిల్/గ్రీజు వంటివి రాయలేదు. వంతెన మరమ్మతుల కోసం టెండరు ప్రక్రియ జరపలేదు. కాంట్రాక్టును నేరుగా కేటాయించారు`` అని హెచ్ఎస్ పాంచల్ అన్నారు.
పోలీసు కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు ఒరేవా కంపెనీ మేనేజర్లు అని వెల్లడించారు. మిగిలిన ఇద్దరు వంతెనకు ఫ్యాబ్రికేషన్ పనులు చేశారని తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఐదుగురిలో భద్రతా సిబ్బంది, టికెట్ విక్రేతలు ఉన్నారని చెప్పారు.
మరోవైపు, ఘటనపై జరుగుతున్న విచారణపై మోర్బీ ఎస్పీ రాహుల్ త్రిపాఠీ కోర్టుకు వివరాలు వెల్లడించారు. 'మా కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నాం. వంతెన మరమ్మత్తుల విషయంలో లోపాలకు బాధ్యులు ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో ఎవరి పాత్రైనా ఉందని తేలితే వారిని అరెస్టు చేస్తాం' అని తెలిపారు.
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 140 మంది మరణించారు. మచ్చూ నదిపై ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. వంతెనకు ఏడు నెలల పాటు మరమ్మత్తులు నిర్వహించారు. రిపేర్లు పూర్తై.. వంతెన తెరిచిన నాలుగోరోజే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ఈ ఘటనపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.