ఆంక్షలున్నా ఆమెరికా ముద్దు

Update: 2018-11-13 15:25 GMT
ఆమెరికా విద్యకు - ఉద్యోగాలకు కలలు కనే దేశం. అక్కడికి వెళ్లి చదువుకోవడం అన్నా  - ఉద్యోగాలు చేయడమన్న యువత ఆసక్తి చూపుతారు. "మావాడు ఆమెరికాలో ఉంటున్నాడోయ్. మీ అబ్బాయ్ మాటేమిటి.."....."మా అమ్మాయికి ఆమెరికా సంబంధం చేస్తున్నాం మీ అమ్మాయి మాటేమిటి." వంటి మాటలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తాయి. ఆమెరికాలో చదువుకు - ఉద్యోగాలకు ఉన్న గిరాకి అలాంటిది. అయితే ఆ దేశానికి డోనాల్డ్ ట్రాంప్ అధ్యక్షడు అయిన తర్వాత పరిస్దితి మారిపోయింది. ఆంక్షాల కొరడ ఝళిపిస్తు ట్రంప్ భారత్‌ తో పాటు పలు దేశాల విద్యార్దులను - ఉద్యోగులను భయానికి గురి చేస్తున్నారు. వీసాలతో పాటు అనేక అంశాలలో ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు విద్యార్దులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్నత చదువుల కోసం ఆమెరికా ఎంచుకున్న విద్యార్దులకు కొన్నాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాజాగా జరిపిన సర్వేలు వాటి ద్వారా  వచ్చిన నివేదికల ఆధారంగా ఆసక్తిగల అంశం వెల్లడయ్యింది. అదే ఆమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్దుల సంఖ్య నానాటికి పెరగడం.

అంతర్జాతీయంగా చదువు కోసం ఆమెరికాకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన సర్వేలో వెల్లడవుతోంది. ఇటీవల Open Doors Report on International Education Exchange సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బహిర్గితమయ్యాయి. అధ్యక్షుడి ఆంక్షాలున్న ఆమెరికాలో విద్యను అభ్యసించేందుకు భారత దేశం నుంచి వస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. Open Doors Report on International Education Exchange వారి లెక్కల ప్రకారం గడచిన 5 సంవత్సరాలలో ఆమెరికాలో విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున సంఖ్య 5.4 % పెరిగిందని అంచన వేసారు. ఇతర దేశాల నుంచి కంటే కూడా ఆమెరికాకు భారత దేశం నుంచే ఎక్కువ మంది వెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు భారతీయులు ఆమెరికా కంటే చైనా కే ఎక్కువ వెళ్లేవారు, తాజ పరిస్దితుల రీత్య విద్య కోసం ఆమెరికా వెడుతున్న వారి సంఖ్య ఎంతో పెరిగింది. 2017వ సంవత్సరంలో భారతదేశం నుంచి 1,86,000 మంది విద్యార్దులు ఆమెరికాకు ఉన్నత విద్యను అభ్యసించాడానికి వెళ్లారు. మరోవైపు ఆమెరికా నుంచి భారతదేశానికి వచ్చి చదుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి భారతీయులకు అటు విద్య పరంగాను - ఇటు ఉద్యోగాల పరంగాను కూడా ఆమెరికా ఓ కలల సౌధంలాగే మారుతోంది.


Tags:    

Similar News