మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ దేశా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరవడమే కొత్త చర్చకు...అనేక ఊహాగానాలకు తెరతీయగా...దాదాపు వారం పాటు సాగిన ఈ చర్చకు ఇంకా ముగింపు పడలేదు. ప్రణబ్ కూతురు షర్మిష్ఠ కూడా తన తండ్రి నిర్ణయాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా...సంఘ్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు పిలవగానే వాళ్ల దగ్గరికి వెళ్లడం ఏంటి అని కాంగ్రెస్ లోనే చాలా మంది నేతలు ప్రశ్నించారు. ఈ పరిణామం మరో మలుపు తిరిగింది. తన తండ్రి గురించి వచ్చిన ఓ ఫోటో ప్రణబ్ తనయను షాక్ కు గురిచేసింది.
సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణబ్ ముఖర్జీ సమ్మతించిన నేపథ్యంలో నకిలీ కథనాలను సృష్టించేందుకు ఆరెస్సెస్ కు ప్రణబ్ ఓ అవకాశం ఇస్తున్నారని గురువారమే షర్మిష్ఠ అన్నారు. ఆమె ఊహించినట్లే ప్రణబ్ నాగ్ పూర్ పర్యటనపై ఓ ఫొటో వైరల్ అయింది. ప్రణబ్ ని మార్ఫింగ్ చేస్తూ ఓ ఫోటో బయటకు వచ్చింది. సదరు ఫొటోనే...ప్రణబ్ తనయను కలచివేసింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే....ఆర్ ఎస్ ఎస్ శ్రేణులు ప్రార్థన చేసే సమయంలో కుడిచేతిని ఛాతీకి సమాంతరంగా ఎలా ఉంచుతారో ప్రణబ్ దా అలాగే ఉంచినట్లుగా ఉంది. నిజానికి ప్రార్థన సమయంలో ప్రణబ్ అలా చేయలేదు. దీనికి సంబంధించిన అసలు, నకిలీ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల ప్రణబ్ తనయ వద్దకు చేరి ఆమెను షాక్‌కు గురయ్యేలా చేశాయి. దీంతో ఓ ట్వీట్ లో షర్మిష్ట ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ-ఆరెస్సెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతారని తెలిసే ముందే ప్రణబ్‌ను హెచ్చరించానని ఆయన కూతురు షర్మిష్ఠ అన్నారు. `నేను భయపడినంత జరిగింది. అందుకే అక్కడికి వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను. కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే బీజేపీ ఇలా చిల్లర రాజకీయాలకు తెరతీసింది`` అంటూ అసలు, నకిలీ ఫొటోలు ఉన్న ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.