మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పీవీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. పీవీ ఘాట్ కు చేరుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
ఈ క్రమంలోనే పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ పీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పీవీ తనను రాజకీయాలలోకి రావద్దని సూచించారని ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే పీవీ ఘాట్‌ను కూలకొడతామని ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే అంటే సీఎం కేసీఆర్ మాట్లాడలేదని మండిపడ్డారు. పీవీ మీద దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు.
నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నయమని.. ఒకరిని జైల్లో పెట్టించారని ఎంఐఎం పార్టీని ఉద్దేశించి ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతామన్నారు. పీవీ నరసింహారావును చూసి భారతీయత నేర్చుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు.