హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుడిని స్వయంగా తన కారులోనే ఆసుపత్రికి తరలించారు. ఆయనే స్వయంగా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. అలాగే ఆ క్షతగాత్రుడికి అయ్యే ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. పూర్తి వివరాలు చూస్తే .. ఎంపీ గోరంట్ల మాధవ్ బుధవారం ఉదయం అత్యవసర పని నిమిత్తం తన కారులో బయలుదేరారు. కారు పొగరూరు కెనాల్ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ఒకటి ఎంపీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్ రెడ్డి (36) గాయాలపాలైయ్యాడు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అత్యవసర పని నిమిత్తం తన కారులో బయలుదేరారు. మరోవైపు పొగరూరు గ్రామ కెనాల్ క్రాస్ వద్ద ఉన్న తన పొలానికి నీరుగట్టేందుకు వెంకటేశ్వర్ రెడ్డి వెళ్ళారు. పని ముగించుకొని తన ద్విచక్ర వాహనంలో వెంకటేశ్వర్ రెడ్డి ఇంటిముఖం పట్టాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్తూ అటుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొన్నాడు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా పామిడి ప్రభుత్వాస్పత్రికి తన వాహనంలో తరలించి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చుంతా తానే భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టినప్పటికీ ఎంపీ మాధవ్ పెద్ద మనసుతో వ్యవహరించడాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.