పార్లమెంట్ లోనూ 'మీసం' మెలేసేలా చెప్పాడు

Update: 2019-07-05 08:05 GMT
గోరంట్ల మాధవ్.. హిందూపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన అభ్యర్థి. గడిచిన టీడీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేసి ఏకంగా నాటి టీడీపీ ఎంపీ జేసీతోనే తలపడ్డారు. మీసం మెలేసి  తొడకొట్టడం సంచలనమైంది. అనంతరం ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున హిందూపురం ఎంపీగా పోటీచేసి అనూహ్య - ఉత్కంఠ పరిస్థితుల మధ్య గెలిచారు.

అయితే తాజాగా రాష్ట్రపతి తీర్మానంపై చర్చ సందర్భంగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. తన అనంతపురం జిల్లా వాసుల కష్టాలు - కన్నీల్లు చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలు.. స్ఫూర్తినింపేలా ప్రసంగం ఇప్పుడు ఏపీ ప్రజలను - పార్లమెంట్ ఎంపీలను సైతం విశేషంగా ఆకట్టుకుంది.

అనంతపురం జిల్లాలోని కష్టాలు, కరువు, రైతుల దయనీయ స్థితిపై అనర్గళంగా మాట్లాడారు. పోలీస్ ఆఫీసర్ గా తాను ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసానని.. కరువుతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు గల్ఫ్ కు వెళుతున్నారన్నారు. మహిళలు తీవ్ర కరువుతో వ్యభిచార గృహాలకు తరలిపోతున్నారని వాపోయాడు. పిల్లలు కరువుతో బడికి వెళ్లకుండా పనులకు వెళుతున్నారని వివరించాడు. వీరు తీవ్రవాదులు - టెర్రరిస్టులుగా మారే ప్రమాదముందని.. పిల్లల బాధ్యతను జాతి బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఉపాధి కల్పించాలని కోరారు.

ఇలా గోరంట్ల మాధవ్ తన జిల్లా పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించిన తీరు పార్లమెంట్ లో అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. పార్లమెంట్ సాక్షిగా ఇంత ఉద్వేగం గా మాట్లాడిన గోరంట్లను అందరూ చప్పట్లతో ప్రశంసించడం విశేషం.

   

Tags:    

Similar News