సార్వత్రిక ఎన్నికల్లో బరిలో అడుగు పెట్టటమే కాదు.. ఊహించనిరీతిలో భారీ మెజార్టీతో గెలుపొందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు ఎన్నికల బరిలో దిగిన వారిలో ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ ఒకరు.
బెంగాల్ లోని కీలక ఎంపీ స్థానమైన బసీర్హత్ నుంచి పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థిపై 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మొత్తం 11 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా.. వారిలో నుస్రత్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను వివాహమాడిన ఆమె.. తన వివాహ వేడుకను టర్కీలో చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. బంధువుల సమక్షంలో ఈ వివాహం వేడుకగా సాగింది. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోయారు. ఫోటోలతో నవ వధూవరుల్ని చూసిన పలువురు జంట చూడముచ్చటగా ఉందనటంతో పాటు.. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన ఆమె.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేదు. పెళ్లి కారణంగా ఆమె ప్రమాణస్వీకారం చేయలేదని.. అనంతరం విడిగా చేస్తారని చెబుతున్నారు.