కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన పోరాట పంథాపై క్లారిటీ ఇచ్చారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించే వరకూ నిద్రపోయేది లేదని, కొన ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతానని అన్నారు. కిర్లంపూడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల్లో చేరుస్తామన్న చంద్రబాబు హామీ నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టినందుకు తమకు ఆవేదన మిగులుస్తున్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు. పైగా రిజర్వేషన్ కోరుతున్న కాపులను సెక్షన్ 30 - 144 - కర్ప్యూ - కేసులు - జైలు పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ వారు సైతం ఇటువంటి విధానాలను అవలంబించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతూ తాను డిమాండ్ చేస్తుంటే...పరిపాలనలో భాగస్వామ్యం అయిన మంత్రులు - ఎమ్మెల్యేలు తనపై విమర్శలు చేయడం వింతగా ఉందని ముద్రగడ వ్యాఖ్యానించారు. తాను మంత్రిగా స్వతంత్రంగా పనిచేశానని ఎవరి ఒత్తిడికో తలొగ్గడం కానీ అవినీతికి పాల్పడటం కానీ చేయలేదని స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కల్పించడం, నిబంధనల ప్రకారమే బార్‌లకు లైసెన్స్‌లు ఇప్పించడం చేశానని వివరించారు. తనపై విమర్శలు చేసే వారు వట్టి మాటలు కట్టిపెట్టి వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ చేసి అవకతవకలను గుర్తిస్తే ఏశిక్షకైనా సిద్ధమేనని ముద్రగడ సవాల్ విసిరారు. కేసులకు భయపడి దేశాలు విడిచి పారిపోయే మనిషిని కానని - పాస్ పోర్టు కూడా లేదని అన్నారు. బయట ఉన్నా... జైలులో ఉన్నా కొన ఊపిరి ఉన్నంత వరకూ ఉద్యమం కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తునిలో కాపు ఐక్యగర్జన చేపట్టి ఏడాదైన సందర్భంగా ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు కార్యకర్తలు అందుబాటులో ఉన్న ఆలయాల్లో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేయాలని ఆయన పునరుద్ఘాటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/