ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ.. ఆ జాబితాను రిలీజ్ చేస్తుంటుంది. కొన్నేళ్ల క్రితం ఈ జాబితాలో మనోళ్ల పేర్లు అస్సలు కనిపించేవి కావు. ఒకవేళ కనిపించినా వందల ర్యాంకుల్లో కనిపించేవారు. కానీ.. గడిచిన కొన్నేళ్లుగా మనోళ్లు పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్న పరిస్థితి. తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో మనోళ్లు ఎంతలా దూసుకుపోతున్నారన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది.
గత ఏడాది విడుదల చేసిన జాబితాలో ఉన్న ర్యాంకుతో పోలిస్తే.. ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏకంగా 13వ స్థానంలో నిలిచినట్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. ఏడాది క్రితం ఆయన సంపద 4010 కోట్ల డాలర్లు ఉంటే.. ఈ ఏడాది ఆ సంపద కాస్తా పెరిగి 5000 కోట్ల డాలర్లకు చేరుకోవటంతో ఆయన స్థానం భారీగా మెరుగుపడింది. ఫోర్బ్స్ చెప్పిన దాని ప్రకారం మన రూపాయిల్లో ముకేశ్ ఆస్తి దాదాపు రూ.3.5 లక్షల కోట్లుగా చెప్పాలి.2018లో ఆయన ర్యాంకు 19 కాగా.. ఈ ఏడాది ఆయన 13వ ప్లేస్ కు చేరుకున్నారు.
ఇక.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మళ్లీ నిలిచారు. రెండో స్థానంలో బిల్ గేట్స్.. మూడో స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెజాన్ అధినేత సంపద 1900 కోట్ల డాలర్లు పెరిగి ఏకంగా 13100 కోట్ల డాలర్లకు చేరింది. మన రూపాయిల్లో చెప్పాలంటే అమెజాన్ అధినేత సంపద రూ.9లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న బిల్ గేట్స్ సంపద పెరుగుదల తక్కువగా ఉందని చెప్పాలి. గత ఏడాది 9వేల కోట్లకు ఈ ఏడాది 650 కోట్ల డాలర్ల మాత్రమే చేరింది. మూడో స్థానంలో నిలిచిన వారెన్ బఫెట్ సంపద ఏడాదిలో 150 కోట్ల డాలర్లు పెరిగింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపద ఏడాదిలో 960 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ఐదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయారు. జాబితాలోని మొదటి వంద స్థానాల్లో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. వారిలో ముకేశ్ అంబానీ 13వ స్థానంలో.. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ 36వ ర్యాంకు.. హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 82 ర్యాంకులో నిలిచారు. ఆర్సెల్లర్ మిత్తల్ సీఈవో లక్ష్మీ మిత్తల్ 91వ ర్యాంకులో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది మొత్తం 2153 మంది కుబేరులకు ర్యాంకులు ఇచ్చారు. 2018లో 2208 మంది కుబేరులకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగువారు నలుగురు కావటం విశేషం. వీరిలో దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివీ 645 ర్యాంకులో నిలవగా.. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి. రామ్ ప్రసాద్ రెడ్డికి 804వ ర్యాంక్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకుడు పి.పి. రెడ్డి 1008వ స్థానంలో నిలవగా.. దాని ఎండీ పీవీ కృష్ణారెడ్డి 1057వ ర్యాంకులో నిలిచారు. జాబితాలో చోటు దక్కించుకున్న కుబేరుల్లో 1450 మంది సొంతంగా ఎదిగిన వారే కావటం గమనార్హం.