2019లో అంబానీ సంపాద‌నెంతో తెలుసా?

Update: 2019-12-24 07:17 GMT
ఒక్క సంవ‌త్స‌రంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదించిన సొమ్ము గురించి తెలుసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే! 2019లో అంబానీ సంపాద‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స్థాయిలో ఉంద‌ట! భార‌త ద్ర‌వ్యమానంలో అదెంతంటే.. అక్ష‌రాలా ల‌క్షా ఇర‌వై వేల కోట్ల రూపాయ‌లు!

ఒక్క సంవ‌త్స‌రంలో అంబానీ ఈ రేంజ్ లో సంపాదించాడు. ఇది దేశంలోని చాలా రాష్ట్రాల బ‌డ్జెట్ క‌న్నా చాలా చాలా ఎక్కువ‌. త‌న వ్యాపార సామ్రాజ్యం ద్వారా ఈ మొత్తాన్ని ఒక్క ఏడాదిలోనే వెనకేసుకోగ‌లిగాడు అంబానీ. ఈ సంపాద‌న‌తో అంబానీ మొత్తం సంప‌ద నాలుగు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పై స్థాయిని చేరింద‌ని ఆర్థిక వ‌ర్గాలు అంచ‌నా వేస్తూ ఉన్నాయి!

ప్ర‌స్తుతం ముఖేష్ అంబానీ ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల్లో ఒక‌రిగా ఉన్నారు. దేశంలో అయితే కుబేరుల జాబితాలో ఈ అంబానీకి పోటీ వ‌చ్చే వారే లేరు. గ‌మ‌నించాల్సిన మ‌రో అంశం ఏమిటంటే..ఈ స్థాయిలో కుభేరుడు అయినప్ప‌టికీ.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కు కొన్ని అప్పులున్నాయ‌ట‌!

వాటిని తీర్చ‌డ‌మే అంబానీ త‌దుప‌రి ల‌క్ష్యంగా తెలుస్తూ ఉంది. అందు కోసం కొన్ని వ్యాపారాల్లో షేర్స్ ను అమ్ముతున్నార‌ట అంబానీ. 2021 క‌ళ్లా రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ ను పూర్తిగా డెబిట్ ఫ్రీగా మార్చ‌బోతున్నార‌ట ఆయ‌న‌!
Tags:    

Similar News