ఉత్తర్ ప్రదేశ్‌లో అధికార ఎస్పీలో నెలకొన్న రచ్చ కొలిక్కి వస్తున్నట్లు లేదు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ శనివారం తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఆయన తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. తన సొంత జిల్లా ఇటవాలో జస్వంత్‌నగర్ నియోజక వర్గంలో శనివారం మధ్యాహ్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమాజ్‌వాది పార్టీ నాయకత్వం నుంచి ఆయనను కుమారుడు అఖిలేష్ యాదవ్ తొలగించిన తరువాత మౌనంగా ఉన్న ములాయం శనివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొని తిరిగి తనలోని సామర్థ్యాన్ని వెలుగులోకి తీశారు.
సోదరుడు శివపాల్ యాదవ్‌కు ఓట్లు కోరేందుకు ఇక్కడకు వచ్చిన ములాయం అందరిని విస్మయంలో ముంచెత్తుతూ ఎటావా స్థానానికి పోటీ చేస్తున్న లోక్‌దళ్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌దళ్ అభ్యర్థి తనకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో ఎస్‌పీ-కాంగ్రెస్ పొత్తుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రెండు పార్టీల పొత్తును ఆయన బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ములాయం ప్రాతినిధ్యం వహించిన టఖా బ్లాక్‌లోని జస్వంత్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఈ నియోజక వర్గం నుంచి ఆయన సోదరుడు శివపాల్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచార సభలో ఆయన దాదాపు అరగంట సేపు ప్రసంగించారు. అంతకుముందు ఓటర్లు తమ మేనిఫెస్టోను చూసి ఎగతాళి చేశారని, కాని ఎన్నికల హామీలన్నిటినీ నెరవేర్చామని ములాయంసింగ్ యాదవ్ అన్నారు. రైతుల భూములు వేలం వేయకుండా చట్టాలు రూపొందించామన్నారు. రైతుల సంక్షేమానికి తాము రూపొందించిన చట్టాల తరహాలోనే అమెరికా కూడా చట్టాలు రూపొందించిందని తెలిపారు. సమాజ్‌వాది పార్టీకి యువతే బలమని సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ అన్నారు.
మరోవైపు ముస్లిం మైనార్టీలు సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి ఓటువేస్తే అది బీజేపీకి లాభం చేకూర్చినట్టేనని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. యుపిలోని శహరన్‌పుర్‌లో ఎన్నికల సభలో ప్రసంగించారు. 'కొడుకు ప్రేమలో పడి శివపాల్ యాదవ్‌ను ఎస్‌పి వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అవమానించారు. వాళ్ళ అంతర్గత పోరు ఎన్నికల్లో ఎస్‌పికి ఉన్న అవకాశాలను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో మైనార్టీలు ఎస్‌పికి ఓటు వేస్తే అది బిజెపికే లాభిస్తుంది' అని మాయావతి అన్నారు.