కరోనా రోగులపై ఔషధ క్లినికల్ ట్రయల్స్ కు ముంబై కంపెనీ అనుమతి

Update: 2020-05-01 14:30 GMT
కరోనా వైరస్ సోకిన రోగులపై యాంటీవైరల్ డ్రగ్ ‘ఫెవిపిరవిర్’తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ముంబైకి చెందిన గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్  కంపెనీకి  డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుండి ఈరోజు అనుమతి మంజూరైంది.  ఈ డ్రగ్ ఉత్పత్తిదారు జపాన్ లోని ఫుజిఫిల్మ్ తోయామా కెమికల్ కో లిమిటెడ్. అవిగాన్ అనే మందు యొక్క సాధారణ వెర్షన్ ఇదీ. ముంబై కంపెనీకి డ్రగ్ పరీక్షలకు అనుమతి లభించగానే ఈ రోజు గ్లెన్మార్క్ షేర్లు 9% అధికంగా  ఎగబాకాయి.

"ఫావిపిరవిర్’’ ఇన్ఫ్లుఎంజా వైరస్లకు వ్యతిరేకంగా బాగా పనిచేస్తోంది.   కరోనా ఇన్ఫ్లుఎంజా వైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం జపాన్ లో ఇప్పటికే ఆమోదించబడింది. ఇటీవల గత కొన్ని నెలల్లో, కరోనా వ్యాప్తి తరువాత, కరోనా రోగులపై బహుళ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబడ్డాయి. చైనా, జపాన్ మరియు యుఎస్ లో  ఈ డ్రగ్ తో ఇప్పటికే సత్ఫలితాలు వచ్చాయి."అని గ్లెన్మార్క్ కంపెనీ తెలిపింది.  

కరోనా సోకిన నేటి వరకు భారతదేశం లో కరోనా సోకిన రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి రెగ్యులేటర్ అనుమతి పొందిన మొట్టమొదటి  ఔషధ సంస్థ గ్లెన్మార్క్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ఆమోదించిన ప్రకారం, తేలికపాటి నుండి మోడరేట్ కరోనా రోగులకు  150 మందిపై ప్రయోగించవచ్చు.  చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు. ఈ పరీక్షల మొత్తం అధ్యయన వ్యవధి రాండమైజేషన్ నుండి 28 రోజులు గరిష్టంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

గ్లోబల్ ఆర్ అండ్ డి, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుశ్రుత్ కులకర్ణి మాట్లాడుతూ..  "క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే, ఫావిపిరవిర్ మందు కరోనా రోగులకు సంభావ్య చికిత్సగా మారవచ్చు" అని తెలిపారు.

మరో భారతీయ ఔషధ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్ బుధవారం ఫేవిపిరవిర్ యాంటీవైరల్ టాబ్లెట్లను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా సిద్ధం చేసిందని.. ట్రయల్స్ ప్రారంభించడానికి అధికారులకు దరఖాస్తు చేసిందని చెప్పారు.

ఇక అమెరికాలో కూడా ఔషధ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.  గిలియడ్ సైన్సెస్ ఇంక్ ఔషధ కంపెనీ ప్రయోగాత్మక యాంటీవైరల్ డ్రగ్ ‘రెమెడిసివిర్’ ఇచ్చిన రోగులు ప్లేసిబో ఇచ్చిన దానికంటే వేగంగా కోలుకున్నారని తేల్చింది. ఆ డ్రగ్ ను వాణిజ్యపరంగా వాడడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
Tags:    

Similar News