ముంబై మరో సారి మెరిసింది. వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ని కిందకు తోసి ముంబై ఆ స్థానానికి చేరింది. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న ఢిల్లీ మొదటి నుంచి బాగా ఆడినా ఆఖర్లో ఆశించినంత వేగంగా ఆడకపోవడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులకే పరిమితమై ఓడి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. తొలి ఓవర్లోనే పృథ్వీ షా (4) పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రహానే (14)ఆకట్టుకోలేక పోయాడు. ధావన్-శ్రేయాస్ జంట మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఫామ్ లో ఉన్న
స్టొయినిస్ 13 పరుగులు చేశాడు. లేని పరుగు కోసం రన్ ఔటయ్యాడు. దీంతో ఆఖర్లో పరుగుల వేగం తగ్గింది. అలెక్స్ క్యారీ (14) పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది.
ఛేదనలో ముంబై బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ (5) ఔట్ అయినా డికాక్ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు - 3 సిక్స్‌లు), సూర్యకుమార్ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు - 1 సిక్స్) అదరగొట్టారు.హర్దిక్ పాండ్యా (0)ఇషాన్ కిషన్ (28) అవుటైనా కృనాల్ పాండ్యా (12 నాటౌట్) - పొలార్డ్ (11) మ్యాచ్ ముగించారు.
బర్త్ డే బాయ్ పాండ్యా పై కృనాల్ ఫైర్
నిన్న హార్దిక్ పాండ్యా బర్త్ డే. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాండ్యా పై అతడి సోదరుడు కృనాల్ ఫైర్ అయ్యాడు. ఏడో ఓవర్లో కృనాల్ బౌలింగ్ చేశాడు. నాలుగో బంతిని శ్రేయస్ అయ్యర్ ఎక్స్‌ట్రా కవర్‌వైపు కొట్టి రెండు పరుగులు తీశాడు. అయితే అక్కడ ఒకే పరుగు రావాలి. కానీ హార్దిక్ పాండ్యా బాల్‌ను గట్టిగా విసరడంతో ఓవర్ థ్రో రూపంలో ఎక్స్‌ట్రా రన్ వచ్చింది. దాంతో తమ్ముడిపై కృనాల్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని అంత గట్టిగా విసరడం ఎందుకని అరిచాడు.
మ్యాచ్ లో హైలెట్స్
* లీగ్‌లో 7 మ్యాచ్ లాడిన రోహిత్ సేన ఐదో విజయంతో టాప్ లోకి వచ్చింది. ఓటమితో ఢిల్లీ రెండో స్థానానికి పడిపోయింది.
* అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న ముంబై ఓపెనర్ డికాక్ కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
* ధావన్ చాలా రోజుల తర్వాత అర్ధ సెంచరీ చేసినా. ఉపయోగం లేకుండా పోయింది. అతడు కడదాకా ఉన్నా వేగం పెంచలేకపోయాడు.
* హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లోనూ బ్యాటింగ్ లో తేలిపోయాడు. డక్ ఔట్ తో వెనుదిరిగాడు.
* ఢిల్లీ బ్యాట్స్ మెన్ రహానే ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా 14 బంతుల్లో 14 పరుగులే చేసి ఔటై నిరాశ పరిచాడు.
* సూర్య కుమార్ మరో సారి చక్కటి ప్రదర్శన చేశాడు. వరుసగా రెండో అర్ధ సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.