ముంబై పోలీస్ శాఖ లో కరోనా కలకలం .. 12,495 మందికి పాజిటివ్ !

Update: 2020-08-18 17:30 GMT
మహారాష్ట్ర పోలీసు శాఖను కరోనా భయం వెంటాడుతోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న పోలీసు సిబ్బంది సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణం. గడచిన 24 గంటల్లో కొత్తగా 112 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయింది. పోలీస్‌ శాఖ లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 12,495కు చేరింది. మంగళవారం వరకు 10,111 మంది పోలీసులు కోలుకున్నారు.

తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 8,493 కరోనా కేసులు నమోదు కాగా 228 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,358కు చేరుకుంది. ప్రస్తుతం పోలీస్ శాఖ‌లో 2,256 మంది సిబ్బంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందడంతో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 128కి పెరిగింది. ఇకపోతే, మహారాష్ట్ర లో ఇప్పటివరకు దాదాపుగా 6 లక్షలు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇప్పటివరకు నాలుగు లక్షల 20 వేలమంది కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు. అలాగే , 20,037 మంది మరణించారు.
Tags:    

Similar News