ముంబై సిగలో అదే ఘనత

Update: 2015-06-27 10:48 GMT
డల్లాస్, ఫ్రాంక్ ఫర్ట్, వాంకోవర్..ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత నగరాలు. వీటన్నింటిని తలదన్నిపోతోంది మన ముంబై. అదేంటి ప్రపంచస్థాయి నగరాల కంటే...ముంబైలో ఏం ఎక్కువగా ఉంది అనుకుంటున్నారా? భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో జీవన వ్యయ పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత జీవన వ్యయంగల నగరంగా పేరున్న ముంబై... తాజాగా జరిపిన ఓ అంతర్జాతీయ సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ముందున్నట్లు తేలింది.

మెర్కూర్ సర్వే 2015 ప్రకారం అత్యంత జీవన వ్యయం గల నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో ఉండగా... హాంగ్ కాంగ్ రెండో స్థానంలో, జ్యూరిస్ 3వ, సింగపూర్, జెనీవాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. దేశంలోనే దిగుమతి చేసిన వస్తువులు అధికంగా దొరికే, అత్యుత్తమ సౌలభ్యాలు గల నగరంగా ముంభై స్థానం సంపాదించింది. మిగతా నగరాలతో పోలిస్తే...అత్యధికంగా ద్రవ్యోల్భణం పెరిగిపోయిన నగరం కూడా ముంబై ఘనత సాధించింది.

అత్యంత జీవన వ్యయం గల నగరాల వరుసలో 74వ స్థానంలో ముంబై నిలిచింది. ఈ క్రమంలో ఢిల్లీ 132వ స్థానంలో, చెన్నై 157 స్థానంలో ఉందగా..బెంగళూరు 183వ స్థానంలో ఉంది. 200 అంశాల ఆధారంగా ఐదు దేశాల్లోని  207 నగరాల్లో  ఈ సర్వే నిర్వహించారు. ఇళ్లు, రవాణ సౌలభ్యం, ఆహారం, దుస్తులు, నివాస వస్తువులు, ఎంటర్ టైన్మెంట్ తదితర అంశాల్లో ఈ సర్వే నిర్వహించారు.
Tags:    

Similar News