మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూ వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు జోరుగా ప్రచారం సాగుతున్నా.. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నా.. ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం మరింత వేడిని పెంచింది. తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో వెలుగు చూసిన వ్యవహారం తర్వాత.. మునుగోడులో ప్రచార సరళి మారింది. పరస్పరం పోటాపోటీ ఆందోళనలతో టీఆర్ ఎస్, బీజేపీ నేతలు ప్రచార పర్వాన్ని జోరెత్తిస్తున్నారు. దీంతో వీరి ప్రచారాన్ని.. మాటలను వినలేక జనాలు అల్లాడిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందంటూ మునుగోడు వ్యాప్తంగా టీఆర్ ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగారు. ఇక, దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు కూడా.. అంతే రేంజ్‌లో తమపై పోటీపడలేక అసత్య ఆరోపణలతో బురద చల్లుతున్నారని ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తుతున్న మునుగోడు పోరు ఈ మొయినాబాద్ ఎఫెక్ట్‌తో పీక్ కు చేరిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని మంత్రులు పిలుపు ఇస్తున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలాగా టీఆర్ ఎస్ కు తాము అమ్ముడుపోయే రకం కామని ప్రచారానికి వస్తున్న పలువురు ఎమ్మెల్యేలు గల్లీగల్లీలోనూ మోత మోగిస్తున్నారు. అంతేకాదు.. స్వామిజీలను ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వంలోకి లాగడం సిగ్గు చేటని కూడా..తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇక, టీఆర్ ఎస్ ప్రచారానికి దీటుగా.. బీజేపీ కూడా అదే రేంజ్‌లో వ్యతిరేక ప్రచారం చేపట్టింది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ దర్శకత్వంలో ఇలాంటి నాటకాలకు తెరలేపారంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. బీజేపీ శ్రేణులు పలు చోట్ల బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఈ వ్యవహారంతోఇప్పటి వరకు ఉన్న ప్రచారం యూటర్న్ తీసుకోవడంతో ప్రజలు వీరు చెప్పేది ఏది నిజమో తెలియక.. ఒకింత అసహనానికి గురి అవుతున్నారు. ఇంతకు ముందు నాయకులు ఇళ్లకువస్తే.. అంతో ఇంతో ఆదరణ చూపించిన వారు కూడా.. తలుపులు మూసేసుకుంటున్న పరిస్తితి వస్తోంది. ఎప్పుడు మూడో తారీకు వస్తుందా? అని మునుగోడు ఎదురు చూస్తోందంటే.. అతిశయోక్తికాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.