తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అలక వహించారా..? అందుకే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారా..? పార్టీలోని కొందరు నేతల వైఖరి వల్లే బండి సంజయ్ ఇలా చేశారా..? అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది ఈ విషయంపై చర్చించేందుకేనా..? అంటే పార్టీ శ్రేణులు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. దీనికంతటికీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కారణం అని తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బీజేపీ ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలో ఆయన భువనగిరి ఎంపీగా పనిచేసినప్పుడే ఢిల్లీలోని అన్ని పార్టీల నేతలతో పరిచయాలున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలతో సంబంధం లేకుండానే ఏకంగా కేంద్ర పెద్దలతో తరచూ భేటీ అయ్యేవారు.
ఆర్థికంగా బలవంతుడైన రాజగోపాల్ పట్ల మోదీ, అమిత్ షాలకు సదభిప్రాయమే ఉండేది. ఈ పరిచయాలతోనే ఆయన రాష్ట్ర నేతలను ఖాతరు చేయకుండా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ లో రేవంత్ మాదిరిగా స్వతంత్రంగా ఎదగాలనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి వైఖరి వల్ల బండి సంజయ్ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక అవ్వనేలేదు.. పార్టీ గెలవనేలేదు.. కానీ ఆ పార్టీలో సీఎం మాదిరిగా రాజగోపాల్ ఫీల్ అవుతున్నారట. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లతో కలిసి తనకంటూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఏర్పరుచుకుంటున్నారట. వీరి ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లు ఆశిస్తున్నారట.
ఆ నేతలు ఎవరో కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్. వీళ్ల ముగ్గురితో కలిసి రాజగోపాల్ ఒక టీంను తయారు చేసుకుంటున్నారని.. ఆయా జిల్లాల్లో ఉన్న వీరి అనుచరులకు టికెట్లు హామీ ఇస్తున్నారని ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి బండిని దూరం పెట్టారని.. గెలుపు ఆయన ఖాతాలో పడకుండా జాగ్రత్త పడుతున్నారని చర్చ జరుగుతోంది.
ఈ విషయం తెలిసిన బండి సంజయ్ అలక వహించారట. ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారట. దీంతో మేల్కొన్న ఢిల్లీ పెద్దలు హుటాహుటిన బండిని పిలిపించి చర్చలు జరిపారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అన్ని విషయాలపై నిర్ణయం తీసుకుందామని హితబోధ చేశారట. దీంతో మెత్తబడ్డ బండి ఈ రోజు నుంచి ఉప ఎన్నిక ముగిసే వరకు ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.