టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటనను అడ్డుకున్న పోలీసులు ఎదురు టీడీపీ నేతలపైనే తీవ్రమైన కేసులు పెట్టారు. టీడీపీ నేతలపై ఏకంగా హత్యయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ లో 3 ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు... టీడీపీ కార్యకర్తలపై 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
దాదాపు 50 మందికిపైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపైనే తిరగబడ్డారని, వారిని చంపేందుకు ప్రయత్నించారని కేసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో శాంతి పురం సహా పలు ప్రాంతాలకు చెందిన టీటీడీ కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేయడం గమనార్హం.
శాంతిపురం:
సెక్షన్ 290, 188, 341 కింద ఎన్. రాజశేఖర్, నాని బాబు, లార్డాస్ రాజులపై కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు హత్యాయత్నం నమోదు చేశారు.
గొల్లపల్లి క్రాస్:
సెక్షన్లు 148, 147, 332, 341, 353, 307r w, 149. కింద కేసులు నమోదు చేశారు. వీరిలో విశ్వనాథ నాయుడు, కేదామత్, ఆంజనేయరెడ్డి, చంద్రకళ, నాగరాజు, అనసూయ, ప్రవీణ్, సుగుణ, రమేష్, జైపాల్ ఉన్నారు. వీరిపైనా పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. అదేసమయంలో కానిస్టేబుల్ వినోద్ , సిఐ తులసీరాం పై దాడి చేశారని పేర్కొన్నారు.
పెద్దూరు:
పెద్దూరు విలేజ్ సబ్ ఇన్ సెపక్టర్ సుధాకర్ విధులకు ఆటంకం కలిగించారంటూ.. సెక్షన్లు 341, 353red with, 34 ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో మంజునాథ్, అరణ కూమార్ తదితరులు ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.