అయోధ్య తీర్పు.. ముస్లింబోర్డు ఏం చేయబోతోంది?

Update: 2019-11-17 09:32 GMT
అయోధ్యపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమిని రామాలయ నిర్మాణానికి ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్మామ్మాయ స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది.

అయితే ఈ తీర్పుపై ముస్లిం సంఘాలకు రివ్యూ చేసే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది. ఇప్పటికే అయోధ్యలోని కొన్ని సంఘాలు తీర్పును స్వాగతించి రివ్యూకు వెళ్లకూడదని నిర్ణయించారు. అయోధ్య కేసులో ప్రతివాదులైన ముస్లిం సంఘాలు కూడా రివ్యూకు వెళ్లమన్నాయి.

అయితే మరికొన్ని ఎంఐఎం సహా ముస్లిం సంఘాలు దీనిపై పట్టువీడడం లేదు. ఈ నేపథ్యంలో అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై లక్నోలో ‘అల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు’(ఏఐఎంపీఎల్ బీ) ఆదివారం సాయంత్రం సమావేశమవుతోంది. ఎంఐఎం సహా ముస్లిం పార్టీలు - సంఘాలు - దేశంలోని కీలక ముస్లిం మతపెద్దలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వీరంతా అయోధ్య తీర్పుపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

రివ్యూ పిటీషన్ వేయాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఐఎంపీఎల్ బీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. దీంతో ముస్లింలు దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News