బీజేపీకి బేగం ఓటేసిందని విడాకులా?

Update: 2016-04-16 04:47 GMT
ఎంత భార్య భర్తలైనా.. భర్త చెప్పినట్లే భార్య ఓటేయాలా? తనకు నచ్చినట్లుగా ఓటు వేయకూడదా? అన్న భావనతో ఓటేసిన బేగం అనే మహిళకు అనుకోని షాక్ తగిలింది. అసోంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామ పెద్దలు.. భర్త చెప్పిన దానికి భిన్నంగా బీజేపీకి ఓటేశారు దిల్వారా బేగం. అంతే.. ఆమెకు భారీ శిక్షనే విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

అసోంలో జరుగుతున్న ఎన్నికల్లో సోనమ్ అడ్డహతి గ్రామానికి చెందిన పెద్దలు.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించారు. గ్రామ పెద్దలు చెప్పినట్లే ఆ గ్రామానికి చెందిన వారంతా కాంగ్రెస్ కు ఓటేశారు. అయితే.. దిల్వారా బేగం అనే మహిళ మాత్రం వీరి మాటలకు భిన్నంగా బీజేపీకి ఓటేసింది. గుట్టుగా వేసిన తన ఓటు వివరాలు బయటకు రావనుకుందో ఏమో కానీ.. తన మనసుకు నచ్చినట్లు ఓటేసింది.

అయితే.. బయటకు ఎలా పొక్కిందో కానీ.. బీజేపీకి ఓటేసిన బేగం ఉదంతం బయటకు వచ్చింది. అంతే..  తమ మాటకు భిన్నంగా ఓటేసినందుకు ఆమెకు విడాకులు ఇవ్వాలని బేగం భర్త అయినుద్దీన్ ను కోరారు. గ్రామ పెద్దలు చెప్పినట్లే  తమ పదేళ్ల వైవాహిక జీవితాన్ని మరిచి.. బేగంకు తలాక్ అని చెప్పేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News