కాస్మో నగరాల్లో కనిపించే వికృతాలన్నీ ఏపీ రాజధానిగా మారిన బెజవాడకు వచ్చేస్తున్నాయి. ఏపీ విభజన ముందు వరకూ పట్టణంగా ఉన్న బెజవాడ ఇప్పుడు తన రంగు.. రుచి.. వాసనను పూర్తిగా మార్చేసుకుంటోంది. ఏపీ రాజధానిగా ఆ మాత్రం కాస్మో టచ్ లేకపోతే ఎలా? అన్నట్లుగా తయారైంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బెజవాడ నగరంలోని ప్రముఖ హోటల్ అయిన ఒలీవ్ ట్రీలో ముజ్రా పార్టీ మాంచి జోష్ లో సాగుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి.
ఇంతకీ ముజ్రా పార్టీ అంటే ఏమిటి? అందులో ఏం చేస్తారు? బెజవాడ ఒలీవ్ ట్రీలో ఏం జరిగింది? అన్నది చూస్తే.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందినది ముజ్రా పార్టీ. అక్కడ శుభకార్యాలు.. వివిధ రకాల పార్టీలు జరుపుకునే వేళలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తారు. అందమైన అమ్మాయిల్ని బుక్ చేసుకొని.. పార్టీలో వారి చేత అర్థనగ్నంగా.. నగ్నంగా డ్యాన్సులు చేయిస్తారు. ఈ సందర్భంగా మంద్రమైన మ్యూజిక్ తో పాటు.. కిరాకు పుట్టించే సౌండ్ తో భారీగా సాగుతుంది.
కళ్లు చెదిరే అందగత్తెలు మ్యూజిక్ కు లయబద్ధంగా నృత్యం చేస్తుంటే.. వారిని చూసి ఎంజాయ్ చేసే వారు ఎంజాయ్ చేస్తారు. కాస్త హుషారుగాళ్లు అయితే కరెన్సీ నోట్లను విసురుతూ సంతోషిస్తుంటారు. అదే సమయంలో మద్యం ఏరులై పారటం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అంతేనా.. ఇదే ఊపులో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు సైతం గుట్టుగా సాగిపోతుంటాయి.
సాధారణంగా మెట్రో నగరాల్లోనూ.. కాస్మో సిటీస్ లోనూ నగర శివారుల్లో ఇలాంటి పార్టీలను నిర్వహిస్తుంటారు. మొదట ముజ్రాగా మొదలైన ఈ పార్టీలు తర్వాత రేవ్ పార్టీలుగా మారాయి. ఇందులో ఒక అడుగు ముందుకేసి డ్రగ్స్ ను వినియోగించటం షురూ చేశారు. ఒకవైపు అమ్మాయ్.. మరోవైపు మందు.. మరింత కిక్ కావాలంటే డ్రగ్స్ అన్నట్లుగా సాగే పరిస్థితి.
ఇక.. బెజవాడలోని ఒలీవ్ ట్రీలో జరిగిన ముజ్రాపార్టీ మాంచి రసపట్టులో ఉన్న వేళలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో.. హోటల్ యాజమాన్యం అతితెలివితో వ్యవహరించి లైట్లు ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పిచ్చ వేషాలు వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా హోటల్లోకి వెళ్లిన పోలీసులు.. పార్టీ లోపల నుంచి బయటకు రాకుండా ప్లాన్ చేశారు. దీంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో లైట్లు వేసి.. విటులను అరెస్ట్ చేశారు. డ్యాన్సులు వేసేందుకు వచ్చిన అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా ముజ్రా పార్టీ అంటే ఏమిటో..?