రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నవ వధువు సృజన మరణం వెనుకున్న మిస్టరీ వీడిపోయింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ తో పాటు.. అన్నింట్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. ఉన్నట్లుండి పెళ్లి పీటల మీదా.. అందునా పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టే వేళలో కుప్పకూలిన వైనం వెనుక అసలేం జరిగింది? అన్నది పెద్ద సందేహానికి తావిచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులోనూ.. ఆమె విషాన్ని సేవించిందన్న విషయాన్ని బయటపెట్టింది. దీంతో.. వధువుకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా? అసలేం జరిగింది? లాంటి సందేహాలకు పోలీసుల విచారణతో మొత్తం మిస్టరీని చేధించారు పోలీసులు.
మొదట గజిబిజిగా.. గందరగోళంగా.. ఎలాంటి ఆధారాలు లభించని ఈ ఉదంతంపై విశాఖ పోలీసులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని తమ విచారణ షురూ చేసిన తర్వాత నుంచి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
తన పెళ్లిని ఆగిపోయేలా చేయాలన్న ప్లాన్ తో చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి ప్రాణాలు పోయే వరకు విషయం వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. పెళ్లికి ముందు మరో యువకుడితో సృజన ప్రేమలో ఉందన్న విషయాన్ని గుర్తించారు. పెళ్లికి మూడు రోజుల ముందు కూడా ప్రియుడితో ఇన్ స్టాలో చాటింగ్ చేసిన విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. మరింత లోతుల్లోకి వెళ్లగా విషయం మొత్తం బయటకు వచ్చింది.
విశాఖపట్నంలోని పరవాడకు చెందిన మోహన్ - హైదరాబాద్ కు చెందిన సృజన ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి గురించి పెద్దల్ని సంప్రదించాలనుకున్నప్పటికీ.. తనకు సరైన ఉద్యోగం లేని కారణంగా మరికొంత టైం కావాలని మోహన్ కోరేవాడు.
ఇంతలో సృజనకు పెళ్లి చేయాలని వారింట్లోని వారు నిర్ణయించుకున్నారు. దీంతో.. ప్రియుడి మీద ఆమె ఒత్తిడి పెంచింది. తనను ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని.. పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే.. తన కోసం మరో రెండేళ్లు ఆగాలని ప్రియుడు ఆమెను కోరాడు. తనకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా కోరాడు.
దీంతో అతడ్ని నమ్మిన సృజన.. తన పెళ్లిని తాను ఆపేస్తానని అతడికి హామీ ఇచ్చిందని.. తన ప్లాన్ లో భాగంగా ఆమె విషయాన్ని సేవించింది. అయితే.. ఆమె ఊహించిన దాని కంటే ఎక్కువ తీవ్రత కారణంగా ఆమె మరణించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సృజన ఇన్ స్టాతో పాటు.. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఇదంతా గుర్తించారు. అయితే.. వారు చాటింగ్ చేసుకున్న తర్వాత తమ చాటింగ్ ను డిలీట్ చేసినప్పటికీ.. సాంకేతికత సాయంతో దీన్ని రీట్రీట్ చేసుకోవటంతో.. అసలేం జరిగిందన్నది బయటకు వచ్చి మిస్టరీ తేలిపోయింది.