బాలకృష్ణపై వరుసగా ఆరు వీడియోలు వదిలిన నాగబాబు ఆ వివాదానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే తన వీడియోలకు బాగా పాపులారిటీ వచ్చిందనుకున్నాడో ఏమో కాని, ఇకపై రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తాను, సరదా వ్యాఖ్యలు చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించి మొదటగా మంత్రి నారా లోకేష్ పై కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు అనూహ్య స్పందన రావడంతో ఈసారి వైఎస్ జగన్ పై కామెంట్ చేశాడు. ఇటీవల టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలను తీసుకుని నాగబాబు వాటిపై సెటైర్ వేశాడు.
ఆ ఇంటర్వ్యూలో జగన్.. 'ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ మాటలు అడగరు? అడగాలంటే ఆయన చేసిన అవినీతి అలా ఉంది, అక్కడ దాని మీద ఎంక్వౌరీ ఏ స్టేజీలో జరుగుతుందో నాకు అయితే తెలియదు. బహుశా నా స్టేజీ కూడా దాటి పోయి, కోర్టు స్టేజీ కూడా దాటిపోయి...' అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలను సంధించాడు.
వీడు నా కంటే గొప్పవాడు అన్నప్పుడు.. నేను గొప్పవాడినే కాని, వాడు నాకంటే గొప్ప వాడు అనే అర్థం వస్తుంది, ఇతను నాకంటే ఎక్కువ సాధించాడు అంటే నేను బాగానే సాధించాను కాని, అతడు నా కంటే ఎక్కువ సాధించాడు అనే అర్థం అక్కడ వస్తుంది. వాడు నాకంటే పెద్ద ఎదవ అనే వ్యాఖ్యకు నేను వెదవనే కాని, వాడు నాకంటే పెద్ద ఎదవ అనేది ఆ మాటలో అర్థం. ఇక్కడ కూడా జగన్ గారు నా స్టేజీ కూడా మించి పోయారు అంటూ చెప్పారు. అంటే అవినీతిలో జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక స్టేజీ ఉందని, ఆ స్టేజీని చంద్రబాబు నాయుడు దాటేశాడు అంటూ జగన్ స్వయంగా ఒప్పుకున్నాడంటూ నాగబాబు కామెంట్ చేశాడు. తనకంటే ఎక్కువ స్టేజీకి వెళ్లిన చంద్రబాబు నాయుడును చూసి ఒకరకంగా జగన్ మోహన్ రెడ్డి గారు జెలసి ఫీల్ అవుతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను వింటుంటే అనిపిస్తుందంటూ నాగబాబు కాస్త ఎటకారంగా కామెంట్స్ చేశాడు. ఏపీకి చెందిన యువ నాయకులపై కామెంట్ చేసిన నాగబాబు తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి.
Full View