మిగిలింది ఒక్కరోజే: సాగర్ లో తేలని టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు

Update: 2021-03-26 07:58 GMT
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఈ శుక్రవారాన్ని మినహాయిస్తే వరుస సెలవుల కారణంగా సోమవారం ఒక్కరోజు మాత్రమే నామినేషన్ వేయడానికి గడువు ఉంది. అయినా కూడా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులను తేల్చలేదు. ఇక కాంగ్రెస్ జానారెడ్డి 30న నామినేషన్ వేయనున్నారు. అయినా ఇంకా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

తిరుపతిలో త్యాగానికి గాను నాగార్జునసాగర్ లో జనసేనకు అవకాశం కల్పించేందుకు బీజేపీ యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈసీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీలోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుదిగడువు కాగా.. దానికి మూడు రోజుల ముందు సెలవులు ఉంటాయని ఈసీ పేర్కొంది.

ఈనెల 27,28,29 వరుస సెలవులు ఉంటాయని.. ఆయా తేదీల్లో నామినేషన్లను స్వీకరించబోమని సాగర్ రిటర్నింగ్ అధికారి ఆర్వో రోహిత్ సింగ్ వెల్లడించారు.  దీంతో సాగర్ లో నామినేషన్లకు వరుస సెలవులు ఉంటాయన్న విషయాన్ని ఈసీ గురువారం ప్రకటించింది.

శుక్రవారం మార్చి 27 మినహా ఒక్కరోజే చివరిరోజైన మార్చి 30 మాత్రమే అభ్యర్థులకు నామినేషన్లకు అవకాశం ఉంది. ఇంత గడువు ముంచుకు వస్తున్నా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలు అభ్యర్థి విషయంలో దోబూచులాడుతున్నాయి. చివరి రోజే అభ్యర్థిని ఖరారు చేసి అప్పటికప్పుడే నామినేషన్ వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి.

టీఆర్ఎస్, బీజేపీలో సాగర్ టికెట్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడడంతో వ్యూహాత్మకంగా రెండు పార్టీలు అసమ్మతి తగ్గించాలని చివరిరోజు అభ్యర్థిని ఖరారు చేయాలని యోచిస్తున్నాయి.
Tags:    

Similar News