ఏపీ రాజకీయాలు ట్రాఫిక్ తో రద్దీగా ఉన్న రోడ్డులా మారుతున్నాయి. దాంతో సందు దొరికినప్పుడే ముందుకు పోగలుస్తున్న నేతలకే చోటుంటోంది. ఏమాత్రం వెయిట్ చేసినా వెనకొచ్చే వాహనాలు దాటి వెళ్లిపోతున్నట్లుగా మిగతా లీడర్లు ఓవర్ టేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పాపం.. ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుంటే సొంత సోదరడే ఆయన కంటే ముందు చక్కబెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో గ్రిప్ సాధించేస్తున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఇప్పుడు విభేదాలు మొదలయ్యాయని వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సోదరుడు కీలకంగా వ్యవహరించేవారు. ఇద్దరి మధ్యా సఖ్యత బాగా ఉండేది. విభజన తరువాత - కిరణ్ సొంత పార్టీ పెట్టినప్పుడు.. ఆ పార్టీ చతికిల పడిన తరువాత కూడా సోదరుడు కిశోర్... కిరణ్ వెంటే ఉన్నారు. కానీ.. మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నా కిరణ్ ఎటూ తేల్చకపోవడంతో ఆయన రీసెంటుగా టీడీపీలో చేరిపోయారు. తానెప్పుడూ పెద్దగా పదవుల్లో లేకపోయినా కుమారుడిని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతోనే ఆయన జాగ్రత్తపడినట్లుగా చెబుతారు. కిరణ్ సోదరుడు కుమారుడు అమరనాథ్ రెడ్డి కూడా తండ్రితో పాటే నియోజకవర్గమంతా ఇప్పుడు కలియ తిరుగుతున్నారు. అయితే, ఈ తండ్రీ కొడుకుల హల్ చల్ లో ఎక్కడా కిరణ్ పేరు వినపడడం లేదు. ఫ్లెక్సీల్లోనూ చంద్రబాబు - లోకేశ్ ల చిత్రాలు తప్ప కిరణ్ కి చోటు ఉండడం లేదు. దీంతో అన్నదమ్ములు ఇద్దరికీ పడడం లేదని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
కిషోర్ కుమార్ రెడ్డి - ఆయన తనయుడు అమర్ నాథ్ రెడ్డి పీలేరులో పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ తరపున అమర్ నాథ్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆయన తన కొడుకుని కూడా వెంట వేసుకుని సభలకు హాజరవుతున్నారు. అయితే... ఎక్కడా తన పేరు కానీ, ఫొటో కానీ వాడుకోవద్దని కిరణ్ కుమార్ రెడ్డే చెప్పారని తెలుస్తోంది. కిషోర్ కుమార్ రెడ్డిపై కిరణ్ అసంతృప్తితో ఉన్నారని... ఆయన టీడీపీలో చేరడం కిరణ్ కు ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. కాగా ఎటూ తేల్చని కిరణ్ వ్యవహారం అర్థం కాక క్యాడర్ కూడా ఇప్పుడు కిశోర్ కుమార్ రెడ్డి వెంటే నడుస్తోంది. దీంతో కిరణ్ పట్ల ఇప్పుడే పార్టీ కూడా ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది.