తమిళనాడులో నాలుగు సీట్లు రాబట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. పొలిటికల్ వ్యూహాల నుంచి సినీగ్లామర్ వరకు అన్నీ వాడేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి హాట్ బ్యూటీ నమితను రంగంలోకి దించింది. అసలే.. తమిళ తంబీలు గుడికట్టిన చరిత్ర ఈ పొన్నుది. అధిష్టానం పిలవడంతో.. ‘ఓ యస్’ అంటూ ప్రచార రథం ఎక్కింది.
రామనాథపురం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్లింది నమిత. ‘యూ ఆర్ మైడియర్ మచ్చాస్’ అంటూ బట్లర్ తమిళ్ లో మాట్లాడేస్తూ సభికులను ఉత్తేజ పరిచేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. రావాల్సిన వ్యక్తి మాత్రం ఇంకా రావట్లేదు!
బీజేపీ అభ్యర్థిగా ఉన్న కుప్పు రాము మాత్రం నమిత పక్కన లేడు. సహజంగా అభ్యర్థి స్టార్ కాంపెయినర్ కోసం వేచి ఉంటారు. కానీ.. ఇక్కడ రివర్స్ లో జరిగింది. కాంపెయినర్ అభ్యర్థి కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. రామేశ్వరం మునిసిపాలిటీలో మొత్తం నాలుగు ప్రాంతాల్లో నమిత ప్రచారం చేయాల్సి ఉంది. ఇందులో మొదటగా మరుదుపాండియన్ విగ్రహ సమీపంలో ప్రసంగించాలి. దీంతో.. ఉదయం 9.30కే అక్కడికి వెళ్లింది నమిత. కానీ.. 10.15 వరకు అభ్యర్థి రాలేదు.
దీంతో.. అక్కడ ప్రచారం క్యాన్సిల్ చేసుకొని బస్టాండ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి కూడా అభ్యర్థి రాలేదు. దీంతో.. అవమానంగా భావించిన నమిత.. అలిగి హోటల్ కు వెళ్లిపోయారు. సాయంత్రానికి అక్కడికి వెళ్లిన నేతలు ప్రచారానికి పిలవగా.. అభ్యర్థి లేకుండా ప్రచారం చేయడమేంటీ? ఇలాగైతే.. నేను చెన్నై పోతానని వార్నింగ్ ఇచ్చారు. అయినాగానీ.. అభ్యర్థి పట్టించుకోలేదని టాక్. నిజంగా.. దిసీజ్ వెరీ దారుణం కదా!