నమ్మకం కలగడం లేదా? అయితే.. మీరు ‘‘నమ్మ కోవై’’ వాట్స్ యాప్ గ్రూపు ఏం చేసిందో తెలుసుకోవాల్సిందే. అవును.. ఆ వాట్స్ యాప్ గ్రూప్ ఇప్పడు కోయంబత్తూరు పట్టణాన్ని మార్చేస్తోంది. అక్కడి ప్రజా సమస్యలను తీరుస్తోంది. ప్రజలను - అధికారులను ఒక్క చోట చేర్చిన వాట్స్ యాప్ గ్రూప్ ఇది. దీని సహాయంతో సమస్యలు చాలా సులభంగా పరిష్కారమవుతున్నాయి.
ఎంసీ3(మై సిటీ క్లీన్ సిటీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ గ్రూప్ ని క్రియేట్ చేసింది. ఇందులో సాధారణ పౌరులు - ఉన్నతాధికారులు - పోలీసు అధికారులు - విద్యాసంస్థల అధినేతలు... ఇలా ఎందరో ఉన్నారు. వారంతా కలిసి నగర సమస్యలను ఒకదాని తరువాత ఒకటి పరిష్కరిస్తూ వస్తున్నారు.
ఈ మధ్య కోయంబత్తూరులోని అవినాష్ రోడ్డులో ఒక స్కూలు బస్సు మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా వెళ్తున్న దృశ్యాన్ని స్థానికుడు ఒకరు ఈ గ్రూపులో పెట్టారు. అదే గ్రూపులో ఉన్న డీసీసీ వెంటనే స్పందించి పది నిమిషాల్లో ఆ బస్సును నిలిపివేయించి పిల్లలకు ప్రమాదం తప్పించారు. మరో వ్యక్తి గాయపడి రక్తస్రావం అవతూ రోడ్డుపై పడున్న గుర్రం ఫొటోను అందులో పెట్టారు. వెంటనే కలెక్టరు స్పందించి దాన్ని అంబులెన్సులో ఆసుపత్రికి పంపించి కోలుకునేలా చేశారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలున్నాయి. ఇవే కాదు.. రోడ్లు.. వాటర్ సప్లయ్ - మురుగునీటి వ్యవస్థకు సంబంధించినవి ఎన్నో ప్రాబ్లెంలను ఈ యాప్ సహాయంతో పరిష్కరించారు.
ఎంసీ3 స్వచ్ఛంద సంస్థ క్రియేట్ చేసిన ఈ గ్రూపును కిశోర్ మెంటైన్ చేస్తున్నారు. ఆయన తొలుత అప్పటి కోయంబత్తూరు కలెక్టరు అర్చనా పట్నాయక్ ను ఇందులో చేరాల్సిందిగా కోరారు. ఆమె అంగీకరించడంతో ఆ తరువాత మిగతా అధికారులు - ప్రజలు - పారిశ్రామికవేత్తలు ఇలా ఒక్కరొక్కరిని కలిసి వారిని భాగస్వాములను చేశారు. ఇప్పుడు వీరంతా ఈ గ్రూపులో సమస్యలపై చర్చలు జరుపుతుంటారు. పరిష్కారాలు వెతుకుతుంటారు. మొత్తానికి కోయంబత్తూరు ట్రాన్ఫర్మేషన్ లో ఈ గ్రూపు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది.