సినీనటుడు - టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకర్గంలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. సొంత నియోజకవర్గంలో మూడు రోజులపాటు పర్యటించే షెడ్యూల్ ఖరారు చేసుకున్న బాలయ్య తాజాగా మొదటిరోజు మంత్రులతో కలిసి బిజిబిజీగా గడిపారు. హిందూపురంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రూ.20.15 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ "బసవతారకం మాతా శిశు వైద్యశాల"ను వైద్య -ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం మాతా శిశు ఆసుపత్రిలో ఒకేసారి 8 మంది ప్రసవించేలా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు 30మందికి ఉచిత డయాలసీస్ సేవలు అందుతున్నాయని మంత్రి కామినేని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ క్యాజువాలిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో హిందూపురం ఏరియా ఆసుపత్రిలో రాత్రి బస చేయనున్నట్లు మంత్రి కామినేని, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. మంత్రులు కామినేని శ్రీనివాస్ - పరిటాల సునీతతో కలిసి హిందూపురంలో అంగన్ వాడీ సెంటర్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. కాగా మొదటి రోజు సుడిగాలి పర్యటనతో బాలయ్య బిజీగా గడిపేశారు.
మూడ్రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించడం - మధ్యాహ్నం మోడల్ కాలనీలో ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం ఆల్‌హిలాల్ పాఠశాలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రెండో రోజైన శనివారం ఉదయం నూతనంగా నిర్మించిన టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో బాలకృష్ణ పాల్గొంటారు. అనంతరం చిలమత్తూరు మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం హంద్రీనీవా కాలువ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం స్థానికంగా ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ లో పాల్గొని 10గంటలకు ఎంజీఎం క్రీడా మైదానంలో నియోజకవర్గంలోని 3500మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో ప్రసంగించనున్నారు. అనంతరం పింఛన్ దారులతో కలిసి భోజనం చేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/