ఒక్కొక్కరికి ఒక్కోలాంటి మాటలు సూట్ అవుతాయి. అంతే తప్పించి.. ఆవేశం వచ్చిందని హటాత్తుగా బాడీ లాంగ్వేట్ మార్చేయటం అంత తేలిక కాదు. అలా అని ఇదేమీ సినిమా కూడా కాదు. రియల్ లైఫ్ లో.. అందునా రాజకీయ రంగంలో ఉన్న వారు సినిమాటిక్ డైలాగులు చెబితే అంతగా నప్పదన్న విషయాన్ని సీనియర్ నేత.. దాదాపు పదిహేనేళ్లు (కొన్ని నెలలు తక్కువగా) ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు అర్థం కాకపోవటం ఏమిటి? విపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఆయన.. తన రాజకీయ జీవతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితుల్ని గడిచిన కొంతకాలంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సీఎం జగన్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి విపక్ష టీడీపీ విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వేళలో.. జగన్ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా.. ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి.. తన అవసరం ఏపీకి ఎంతన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమంతట తామే అర్థం చేసుకునేలా మాట్లాడాల్సిన వేళ.. అందుకు భిన్నంగా సినిమాటిక్ డైలాగులు చెప్పటం చంద్రబాబుకు ఏ మాత్రం నప్పదన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో కలిసి కర్నూలులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు.. చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే.. బాబు నోటి నుంచి రోటీన్ కు భిన్నమైన డైలాగులురావటమే దీనికి కారణం. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరన్న హెచ్చరికను ఆయన చేశారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి.. వైసీపీ జెండాలు పెట్టటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాటిక్ డైలాగులు వల్లె వేయటం గమనార్హం.
వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనన్న ఆయన.. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా? తప్పుడు కేసులకు కార్యకర్తలు భయపడరన్నారు. జగన్ పాలనలో బాదుడే.. బాడుదని.. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందన్నారు. తన జీవితంలోఇంతటి విధ్వంస పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. తప్పును ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన వారిపైన దాడులు చేస్తున్నారని.. విపక్ష నేతలపై అక్రమకేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్త ఒక వీరుడిగా అభవర్ణించిన ఆయన.. ప్రతి కార్యకర్త వీరుడిగా అభివర్ణించారు. ఓవైపు ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేస్తుందన్న మాట చెబుతూనే.. మరోవైపు తాము కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరన్న అతకని మాటలతో వచ్చే కాసింత మైలేజీ మటాష్ అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తిస్తారో?