మూడేళ్లలో కర్నూలుకు హైకోర్టును ఎందుకు తరలించలేకపోయావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీకి బలం ఉండి కూడా హైకోర్టును తరలించలేక పోయారని నిప్పులు చెరిగారు. ఏమైనా అంటే టీడీపీ అడ్డుకుంటోందని చెప్పి తప్పించుకుంటారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌కు పాలన తెలియదని, తెలిసిందంతా విధ్వంసం ఒక్కటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్నూలులోని కమ్మ సంఘం భవనంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనతో పెట్టుకున్నాడని, తాను తలుచుకుంటే ఏమి జరుగుతుందో తెలిసేలా చేస్తానన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను నిప్పులా బతికానన్నారు. తనపై ఏమైనా ఉంటే ఆధారాలు చూపి సాక్ష్యాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే పోలీసులు నిలవలేరని హెచ్చరించారు. కడపలో ఎయిర్ పోర్టు అధికారులు, కర్నూలులో మునిసిపల్ అధికారుల ఓవరాక‌్షన్‌కు అధికారంలోకి వచ్చాక సరైనా సమాధానం చెబుతానని హెచ్చరించారు.
రాష్ట్రంలో అమరావతిని రాజధానిగా ప్లాన్ చేశామని, అక్కడ ఎకరం రూ.10 కోట్ల చొప్పున 10 వేల ఎకరాలను అమ్ముకుంటే రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కొన్నాళ్లకు రూ.3 లక్షల కోట్లు కూడా ఆ భూములను అమ్మితే వచ్చేవన్నారు. కర్నూలును పారిశ్రామికంగా, విశాఖపట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు, పోలవరం నిర్మాణానికి తన ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ మంత్రులు బస్సు యాత్ర కాదని, గాలియాత్ర చేసుకోవాలని..కొన్నాళ్లకు గాలిలో కలసిపోతారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్మాది, సైకోగా మారి రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదని విమర్శించారు.
సీఎం తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీలంక పరిస్థితి దాపురిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో మరో 3 లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం ఉండడంతో మొత్తం రూ.11 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇందులో అందరూ సీఎంల అప్పుల వాటా కేవలం రూ.3.5 లక్షల కోట్లు అయితే మిగిలిన అప్పంతా జగన్ దేనని ఆన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. సీబీఐ కేసుల్లో ఉన్న ఏ2కు ఇవ్వకపోతే అప్రూవర్గా మారతారనే భయంతో ఒకరికీ.. సీబీఐ కేసులను వాదించే మరొకరికి రాజ్యసీట్లను ఇచ్చారని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఇక వలస పక్షులు మళ్లీ మనగూటికి వస్తాయని, వారిని నమ్మే ప్రసక్తే లేదని, అయితే అది తప్పుకాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మద్యం రేట్లను అధికంగా పెట్టి కమీషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలోని విధంగా మన రాష్ట్రంలో మద్యం బ్రాండ్‌లు ఉన్నాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తెలుగువాళ్లు ఉన్నంత కాలం ఉంటుందని అన్నారు. మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడును నిర్వహిస్తున్నట్లు చెప్పారు.