ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆ నాడు నేనే తెచ్చా.. చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

Update: 2022-05-26 13:57 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ (ISB) బిజినెస్ వార్షికోత్స‌వంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ స్కూల్ మ‌రింత పురోభివృద్ధిలో సాగాల‌ని ఆకాంక్షించారు. అయితే.. దీనిపై టీడీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నాయ‌కులు చంద్ర‌బాబు స్పందించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌  దినదినాభివృద్ధి చెంది భవిష్యత్ బిజినెస్ లీడర్లను అందించాలని  ఆకాంక్షించారు. ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఐఎస్బీ(ISB) 20వ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోడీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 2001లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్బీ) ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని వాజ్పేయి రావడం తనకు మరిచిపోలేని అనుభవమని చంద్రబాబు పేర్కొన్నారు. 90వ దశకంలోనే గచ్చిబౌలి ప్రాంతాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు.. స్వరాష్ట్రంలో ఐఎస్బీని ఏర్పాటు చేసుకో వడానికి పోటీపడ్డాయని తెలిపారు. ఐఎస్బీ ఎర్పాటుకు హైదరాబాద్లో అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి, ఐఎస్బీ బోర్డును ఒప్పించగలిగామ‌ని చంద్రబాబు ఉద్ఘాటించారు. "ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ దినదినాభివృద్ధి చెంది భవిష్యత్ బిజినెస్ లీడర్లను అందించాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. 2001లో ఐఎస్బీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం నాటి ఫొటోలను ట్వీట్కు జోడించారు చంద్రబాబు.
Tags:    

Similar News