ఏపీలో వైసీపీ పని అయిపోయిందా. ఇప్పటికి సరిగ్గా మూడేళ్ల క్రిత్రం 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ. ఆ పార్టీకి యువ నేతగా జగన్ ఉన్నారు. ఆయన ఈ రోజుకీ జనాకర్షణలో తిరుగులేని వారే అని చెప్పాలి. ఇక జగన్ చేతిలో అధికారం ఇంకా రెండేళ్ళు ఉంది. సంక్షేమ రాజ్యం మాది అని చెప్పుకుంటున్నారు. బీసీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చామని, బడుగులు అణగారిన వర్గాలను చేరదీశామని, సామాజిక న్యాయం చేశామని చెప్పుకుంటున్నారు.
ఏపీలో బలమైన పార్టీ మాదని, సింహం సింగిల్ గా వస్తుంది, గెలిచి తీరుతుందని కూడా జబ్బలు చరుస్తున్నారు. మరి అలాంటి వైసీపీ పని అయిపోయిందా ఇది నిజమేనా అంటే ఈ మాటను చంద్రబాబు అంటున్నారు. ఆయన పదే పదే అంటున్నారు. మరి చంద్రబాబు అంచనాలు ఏమిటి, ఆయనకు ఉన్న ధీమా ఏమిటి అంటే అంతా ఒక్క మే నెలలో వచ్చిన ధీమాయే అంటున్నారు. ఆయన అదే నెలలో బాదుడే బాదుడు కార్యక్రమం పేరిట జిల్లాలను తిరిగారు.
దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా మహానాడు విజయవంతం అయింది. లక్షల సంఖ్యలో అక్కడ జనం పోగయ్యారు. దాంతో చంద్రబాబు ఇపుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వార్ వన్ సైడ్ అంటున్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే అధికారమని కూడా ఆయన చెబుతున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడినా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా చంద్రబాబులో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారుతోందా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. వార్ వన్ సైడ్ అంటే మొత్తానికి మొత్తం ఓట్లు కుప్పలా వచ్చి టీడీపీ బ్యాలెట్ బాక్సుల్లో పడిపోవాలి. ఏపీలో అధికార పక్షానికి సింగిల్ సీట్లు రావాలి. అలాంటి సీన్ అయితే ఉందా అంటే కనిపించడంలేదు అంటున్నారు.
అదే టైమ్ లో చంద్రబాబు మాటల వరకూ వార్ వన్ సైడ్ అంటున్నారు కానీ ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో మాత్రం గుట్టు విప్పడంలేదు. రేపటి రోజున ఆయన పొత్తులతోనే వస్తారు అని అంతా అనుకుంటున్నారు. మరి పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే వైసీపీ పని ఎలా అయిపోయింది అని చెప్పగలరు అని అంటున్నారు.
అయితే గతంలో కంటే ఇపుడు టీడీపీకి జనాదరణ పెరిగిందని, సీమ జిల్లాల్లో కూడా మార్పు వస్తోందని, ఇక కోస్తా జిల్లాలూ ఎటూ కొమ్ము కాస్తాయి కాబట్టి వైసీపీ గద్దె దిగడం ఖాయమన్న అంచనాతోనే బాబు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏది ఏమైనా ఇది రాజకీయం. ఒక రాజకీయ పార్టీ పని అయిపోయిందని అనుకోవడం వరకూ ఓకే కానీ అదే ఉదాశీనత అయితే అసలు పనికిరాదు. యూపీలో చూస్తే యోగీ ఆదిత్యనాధ్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు.
బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్ళి విపక్షాలతో చేతులు కలిపారు. ఇక వచ్చేది అఖిలేష్ ప్రభుత్వం అనుకున్నారు కానీ తీరా ఈవీఎంలను విప్పి చూస్తే కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ యోగీ గెలిచారు. అందువల్ల రాజకీయాల్లో అతి ధీమా ఎపుడూ చేటు తెస్తుంది.
అయితే చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం సొంత పార్టీ వారిలో ధైర్యం పెంచి వైసీపీని డీ మోరలైజ్ చేయడానికి ఆ పార్టీ పని అయిపోయింది అని ప్రచారం చేసుకుంటే పరవాలేదు కానీ నేల విడిచి సాములు చేసినా లేక ఒవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించినా అసలుకే ఎసరు వస్తుంది అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీ సర్కార్ కి వ్యతిరేకత మొదలైంది. దాన్ని జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని ఈవీఎంలలో వేసుకోవాల్సింది టీడీపీనే.