చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో తెదేపా సీనియర్ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ ఆర్‌ఆర్ రవి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేయడాన్ని తీవ్రం ఖండించారు. రవి ఇంటిపై దాడికి సంబంధించి ఆయన కుప్పం టీడీపీ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు ఇవ్వాలంటూ రెస్కో ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత సెంథిల్ సోమవారం రాత్రి 10.45 గంటల సమయంలో రవికి ఫోన్ చేశారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు తన వద్ద లేవని.. దేవాదాయశాఖ అధికారులకు అప్పగించామని రవి తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కుప్పం నేతాజీ రోడ్డులో ఉన్న రవి ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను స్థానిక తెదేపా నేతలు తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం ఆయనకు చెప్పారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో గంగమ్మ గుడికి సంబంధించి రూ.96 లక్షలను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా వేశారు. ఆ బాండ్లు ఇవ్వాలంటూ వారం రోజులుగా వైఎస్సార్‌సీపీ నేతలు రవిని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారని రవి ఆరోపిస్తున్నారు. దాడికి రెండు గంటల ముందు కూడా ఫోన్ చేసి బెదిరించినట్టు టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు తన వద్ద లేవని చెప్పినా వినిపించుకోకుండా రవి ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆయన దృష్టికి తెచ్చారు.
కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తాము అధికారంలోకి అంతకు అంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత రవితో మాట్లాడిన ఆయనకు ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి వేళ మహిళలు, చిన్నారులు ఇంటిలో ఉన్నప్పుడు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేయడం వైఎస్సార్‌సీపీ నేతల పైశాచికత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.