అక్కడ ఢిల్లీలో మోడీ..ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు. ఇద్దరి మధ్య భౌతిక దూరం చాలానే ఉంది. ఇక రాజకీయ దూరం కూడా నాలుగేళ్ల పై చిలుకు ఉంది. మోడీతో చెట్టాపట్టాలు వేసిన బాబు అదే మోడీ పీఎం అయితే తాను సీఎం అయి హ్యాపీగా నాలుగేళ్ళ పాటు పాలించారు. తీరా ఎన్నికల ముందు మోడీతో ఢీ కొట్టి ధర్మ పోరాట దీక్షలు అంటూ పొలిటికల్ డ్రామాకు తెర తీశాడు. దేశంలో మోడీ వేవ్ లేదని గుడ్డిగా భావించి రాహుల్ కి జై అన్నారు.
కానీ సీన్ రివర్స్ అయింది మోడీ గతానికంటే ఎక్కువ సీట్లతో 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. దాంతో పాటు ఏపీలో బాబు ఓడిపోయారు. తన ప్రత్యర్ధి జగన్ ఏపీలో పవర్ లోకి వచ్చారు. ఒక విధంగా బాబు మూడేళ్ళుగా పడిన ఉక్కబోత ఎవరికీ కూడా వద్దు బాబోయి అనిపించేలా ఉంటుంది. అయినా అక్కడ ఉన్నది బాబు. తన ఆశను ఆయన ఎపుడూ కోల్పోలేదు. తన టార్గెట్ ని ఆయన అలా చూసుకుంటూనే ఉన్నారు. తన వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు.
మొత్తానికి బాబు రాసిన ప్రేమ లేఖలు అనుకోండి. ఆయన విన్నపాలు అనుకోండి ఫలించాయి. మోడీ చిరునవ్వులు చిందిస్తూ బాబు దగ్గరకు వచ్చారు. ఢిల్లీ వేదికగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత జరిగిన ఈ కలయిక వెనక ఎంతో కసరత్తు ఉంది. ఎంతో మంది కృషి ఉంది. అన్నింటికీ మించి బాబు మార్క్ స్ట్రాటజీ కూడా ఉంది. ఇక బాబుని మోడీని ఒకటి చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఎవరూ అంటే ఆరెస్సెస్ అని జవాబు వస్తుంది
ఆరెస్సెస్ నేతలకు మొదటి నుంచి బాబు అంటే ఒక విధమైన ప్రేమ ఉంది. అభిమానం ఉంది. 2014 ఎన్నికల వేళ కూడా వారు బాబుతో పొత్తులకు మోడీని ఒప్పించారు అని అంటారు. ఇక బాబు తాను మోడీ కంటే సీనియర్ అన్నట్లుగా అప్పట్లో వ్యవహరించడంతో పాటు కొన్ని విషయాల్లో మోడీని దాటుకుని వెళ్ళడం వల్లనే మోడీ షాలు ఆయన్ని దూరం పెట్టారని చెబుతారు. మొత్తానికి బీజేపీకి టీడీపీ తలాక్ అనేసే దాకా సీన్ వచ్చింది.
అయితే ఇపుడు మళ్లీ గతాన్ని పక్కన పెట్టి పాచ్ వర్క్ అంతా చేసుకుని బాబు వచ్చారు. ఆయనకు ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆరెస్సెస్ దోహదపడింది అంటున్నారు. ఆరెస్సెస్ కి రాజ్యాధికారం ముఖ్యం. బీజేపీ భారత దేశాన నలుమూలలా పాతుకుపోవాలి. అన్నింటా విస్తరించాలి. దానికి కావాల్సిన వనరులు దినుసులు అన్నీ కూడా ఎక్కడ ఉంటే అక్కడ వాటిని పట్టుకుని తమకు అనుకూలం చేసుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. వారిది హిందూత్వ అజెండా. అందువల్ల దేశంలో బీజేపీ రాజకీయ విస్తరణకు ఆరెస్సెస్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది
కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆరెస్సెస్ కారణం. ఇపుడు వారి చూపు తెలంగాణా మీద పడింది. తెలంగాణాలో ఈసారి కేసీయార్ ని ఎలాగైనా ఓడించి కమలం పగ్గాలు అందుకోవాలని ఆరెస్సెస్ పంతం పట్టింది. గ్రౌండ్ లెవెల్ వరకూ వెళ్ళి మరీ శోధించే ఆరెస్సెస్ కి తెలిసిన పచ్చి నిజాలు ఏంటి అంటే తెలంగాణాలో ఈ రోజుకీ టీడీపీ స్ట్రాంగ్ గా ఉందని ఏకంగా నలభై నియోజకవర్గాలలో టీడీపీ సత్తా చాటగలదని. ఆ పార్టీ గెలుపోటములను ప్రభావితం చేయగలదని.
అందుకే బాబుతో పొత్తులకు ఆరెస్సెస్ మొదట అడుగులు వేసింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న చంద్రబాబుని పదే పదే ఆరెస్సెస్ నేతలు కలిసి మాట్లాడారు. ఆయనతో అన్ని విషయాలూ పంచుకున్నారు. బాబు సైతం ఏపీలో అధికారం కోసం చూస్తున్నారు. ఆయనకు బీజేపీ తోడూ నీడా కావాలి. అందుకే ఆయన కోరికను గుర్తించిన వారు మోడీ షాలకు చెప్పి మరీ బాబు విషయంలో మెత్తపడేలా చేశారు అని అంటున్నారు.
ఇక మీదట బాబు మోడీ ఎలాంటి అరమరికలు లేకుండా కలసిపోయేలా ఆరెస్సెస్ మధ్యవర్తిగా ఉండి అనీ చూసుకుంటుంది అంటున్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణాలో బీజేపీ ఇలా ఉభయకుశలోపరి మార్గంగా ఈ పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైతేనేం తెలుగు రాజకీయాలలో అత్యంత కీలకమైన మార్పుల దిశగా సాగిన బాబు మోడీ తొలి కలయిక రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు క్రియెట్ చేస్తుందో చూడాల్సిందే.