వైసీపీకి రాసి ఇచ్చేసిన చంద్రబాబు ...?

Update: 2022-09-18 08:30 GMT
తాను అపర చాణక్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు కూడా రాజకీయాల్లో కొన్ని లెక్కలు కరెక్ట్ గా వేయలేక బోల్తా పడిన ఉందంతాలు ఉన్నాయి. వాటి కోసం ఎంతో దూరం వెళ్ళనవసరం లేదు. 2019 ఎన్నికలనే తీసుకుంటే చాలు. ఆయన తమదే విజయమని వైసీపీకి అంత సీన్ లేదని, వ్యతిరేకత మొత్తం బీజేపీకి పోతుందని మోడీతో లడాయి పెట్టుకుని  తప్పుడు  అంచనాల‌తో వేసిన ఎత్తులు ఎదురుతన్నాయి. ఫలితంగా బాబు ఘోర ఓటమిని చవిచూశారు.

ఆ తరువాత నుంచి ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటూ వచ్చారు. బీజేపీతో ఎన్నికల పొత్తు కోసం చూస్తున్నారు. అంతవరకూ వ్యూహం కరెక్టే కానీ బాబు వైసీపీ విషయంలో కూడా ఇపుడు సరైన వ్యూహాలు పన్నలేకపోతున్నారా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు సభకు నమస్కారం అని చెప్పడం కేవలం వైసీపీని లైట్ తీసుకోవడం వల్లనే అని అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎటూ తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వదని, దాని బదులు జనంలో ఉంటే సరిపోతుందని, తన పార్టీ వారు సభలో ఉంటే చాలు అని బాబు భావిస్తున్నారు.

తాను సీఎం అయ్యాకనే సభకు మళ్ళీ వస్తాను అని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడే బాబు రాంగ్ స్టెప్ వేశారు అని విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు లాంటి ఉద్ధండుడు ఉండాల్సింది అసెంబ్లీలో. ఆయనకు మైక్ ఎటూ ఇవ్వరు, కానీ ఆయన ప్రెజెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ బాబు తనకు అందివచ్చిన అవకాశాలను పుచ్చుకుని సభా వేదికగా జగన్ని, వైసీపీ వారిని ఎండగట్టేందుకు ఉన్న విలువైన అధికారాన్ని అవకాశాన్ని  కోల్పోతున్నారా అన్న చర్చ అయితే ఉంది.

అమరావతి కాదు మూడు రాజధానులు అని జగన్ సభను వేదికగా చేసుకుని ధాటీగా తన వాదన వినిపించారు. ఆ సమయంలో బాబు సభలో ఉండి తమ వైపు వాదన కూడా  గట్టిగా  వినిపించాల్సింది అన్న మాట అయితే ఉంది. అలాగే ఏపీ అప్పుల కుప్ప అని విపక్షం అంటే అంతా బాగుంది అని జగన్ సమర్ధించుకున్నారు. దీనికి కూడా సుదీర్ఘమైన ప్రసంగంతో సభలో తన వాణిని బలంగా చాటారు.

మరి బాబు ఈ అవకాశాన్ని కూడా తీసుకుని ఏపీ అప్పులకుప్ప ఎలా అయిందో వివరిస్తే టీడీపీకి మైలేజ్ పెరిగేది అని అంటున్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో అధికార పార్టీ సభను వేదికగా చేసుకునే తన రాజకీయాన్ని చేస్తుంది. శాసనసభను అలా పూర్తిగా వైసీపీకే వదిలేసి ఏకపక్షంగా నడుపుకోమని రాసి ఇచ్చేయడమే బాబు చేసిన అతి పెద్ద తప్పు అని అంటున్నారు. తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలు సభకు వెళ్తున్నా సస్పెండ్ అయి వస్తున్నారు.

బాబు ఉంటే ధీటైన నాయకత్వంతో పాటు దిశా నిర్దేశం కూడా చేసేవారు అన్న మాట ఉంది. అలాగే సభలో విపక్షం అల్లరి చేస్తే సస్పెండ్ చేసి పంపేయాలని వైసీపీ కాచుకుని కూర్చున్న వేళ చర్చల ద్వారానే అధికార పక్షాన్ని బయటకు లాగాలి. ఈ విషయంలో టీడీపీ ఫెయిల్ అవుతోంది. మరి చంద్రబాబు అయితే ఏకంగా సభకు డుమ్మా కొడుతున్నారు ముందు ముందు ఇదే తీరు సాగితే మాత్రం శాసనసభ‌ వేదికగా వైసీపీ తమకు అనుకూలంగా అంతా చేసుకుంటుంది.

అలాగే తాము ఎంతో చేశామని కూడా గొప్పలు చెప్పుకుంటుంది. మరి దానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలు చెప్పాల్సిన టీడీపీ చేష్టలుడిగి చేతులు కట్టేసుకోవడం కంటే రాంగ్ స్ట్రాటజీ వేరేదీ లేదని అంటున్నారు. బాబు లేకుండా రాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళినా నో యూజ్. కానీ బాబు శపధం పట్టి దూరంగా ఉంటున్నారు. పోనీ ఆయన జగన్ మాదిరిగా పాదయాత్ర లాంటివి చేసి జనంలో ఉంటున్నారా అంటే అదీ లేదు. ఇలా టోటల్ గా కనెక్షన్ కట్ చేసుకుంటే నష్టపోయేది టీడీపీయే అన్నది ఒక విశ్లేషణ. ఇప్పటికైనా మించినది లేదు బాబు పునరాలోచన చేసి సభకు వస్తే మంచిదనే సూచనలు ఉన్నాయి.
Tags:    

Similar News