రాజకీయాల్లో వ్యక్తిగత పూజ ఎంతలా ఉంటుందో చెప్పటానికి తాజా ఉదంతమే నిదర్శనం. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి చుట్టూ ఉండే వారు.. తమ మాటలతో ఎక్కడికో తీసుకెళతారనటానికి అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఒక నిదర్శనంగా నిలిచింది. చంద్రబాబు మనమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రధాని మొదలు ఓ మోస్తరు నేత వరకూ దేవాన్ష్ ను ముద్దు చేసేవారు.
మూడు నాలుగు రోజుల క్రితమే అన్నప్రాశన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న దేవాన్ష్ ను ఫ్యూచర్ సీఎంగా పేర్కొంటూ తెలుగు తమ్ముళ్ల నోట వెంట వచ్చిన మాటలు విన్న వారి నోట మాట రాని పరిస్థితి. బుజ్జిగా ఉంటూ.. తల్లిదండ్రుల్ని సైతం సరిగా గుర్తించలేని వయసులో ఉన్న దేవాన్ష్ ను రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొనటం వినిపించింది. వేదిక వద్దకు వచ్చిన దేవాన్ష్ ను తాత అయిన బాలకృష్ణ చేతుల్లోకి తీసుకున్న సమయంలో ఆయన చుట్టు ఉన్న వారిలో కొందరు.. దేవాన్ష్ ను ఫ్యూచర్ సీఎం అంటూ పొగిడేయటం వినేవారికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మాటలు కూడా రాని చిన్నారి భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశాభావం చూస్తే.. రాజరికంగా ఉన్నామా? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి.