లోకేష్ కోసం ఆ త్యాగపురుషుడు ఎవరు.?

Update: 2018-06-28 04:13 GMT
చంద్రబాబు వారసుడు.. తెలుగు దేశానికి కాబోయే అధ్యక్షుడు.. కాబోయే ముఖ్యమంత్రి.. ఎన్ని కొలమానాలున్నా కానీ.. తండ్రి చాటు బిడ్డలాగానే ఇంతవరకూ లోకేష్ బాబు నెట్టుకొస్తున్నాడు. ఎమ్మెల్సీగా పరోక్షంగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టినా తన అపరిపక్వ మాటలు - ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారన్న విమర్శ ఉంది. నాన్న చంద్రబాబు లేకుంటే కొడుకు జీరో అన్న ప్రచారాన్ని పొందాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలు లోకేష్ బాబును నిద్ర లేకుండా చేస్తున్నాయట. అవును తనను తాను నిరూపించుకునే ఈ లిట్మస్ టెస్క్ లో లోకేష్ బాబు ‘పచ్చ’బడుతాడా.? లేక తేలిపోతాడా అన్నది టీడీపీలోని ముఖ్యులను కలవరపెడుతోంది.

లోకేష్ ఎప్పుడు పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ తో పోలికను ఇష్టపడుతాడు. అందుకే కేటీఆర్ శాఖల్ని ఏరికోరి తీసుకొని ఏపీలో మంత్రిగా గ్రాండ్ లాంచ్ అయ్యారు. కానీ తేటతెలుగులో తెనెలొలుకు పదాల్ని వాడకుండా అప్పుడప్పుడు కూనీ చేశారు. పలుమార్లు రాజకీయ అపరిపక్వతతో అభాసుపాలయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు కాకపోవడంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. కేటీఆర్ ఇప్పటికే ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నారు.. ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఒంటిచేత్తో పార్టీని గెలిపించాడు. కానీ లోకేష్ బాబు ఇప్పటివరకూ ఎన్నికల్లో గెలిపించడం కాదు కదా.. సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దుస్థితి. దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టారని ఆ పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలు మరో ఎత్తు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా లోకేష్ బాబు నిరూపించుకోవాలి. ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలి. ఆ తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత. చంద్రబాబు నీడలో కాకుండా సొంతంగా తన ముద్రవేయాలి. అప్పుడు భావి తెలుగుదేశం పార్టీ అధినేత అవుతారు. సీఎం రేసులో నిలబడతాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో లోకేష్ మొదటి టార్గెట్ ఎమ్మెల్యేగా గెలవడమేనట.. అందుకే ఇప్పుడు టీడీపీ తరఫున తాను ఎక్కడ నిలబడితే గెలుస్తానా అని తెగ ఆలోచిస్తున్నాడట.. తండ్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పోటీచేద్దామా.? లేక మామ హిందూపురంకు ఎసరు పెడదామని చర్చల్లో మునిగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం.

చంద్రబాబు ఎన్నో ఏళ్లు గా ప్రాతినిధ్య వహిస్తున్న కుప్పంను వదులుకునేందుకు సుతారం ఇష్టపడడు. ఇక మామ హిందుపూరం తీసుకున్న అక్కడ బాలయ్యపై పీకలదాకా జనానికి కోపం ఉంది. సో హిందూపురంలో పోటీచేసినా అక్కడ గెలవడం అంతా ఈజీ కాదు. అందుకే ఇప్పుడు ఎక్కడ గెలుపు అవకాశాలున్నాయి.. ఎవరి సీటు కొల్లగొడుదామా అని లోకేష్ బాబు తెగ ఆలోచిస్తున్నాడట.. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తమ సీట్లు అడుగుతాడో ఏమోనని హడలి చస్తున్నారట.. లోకేష్ కోసం త్యాగం చేసే ఆ త్యాగపురుషుడి కోసం ఇప్పుడు టీడీపీలో వెతుకులాట మొదలైంది. మరి ఎవరు బలి అవుతారో చూడాలి మరి..
Tags:    

Similar News