ఆ కాలేజీలు విద్యార్థుల పాలిట నరకాలుగా మారుతున్నాయి. చదువు పేరుతో పసి మొగ్గలపై తీవ్ర ఒత్తిడి పెంచేస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేని ఆ చిన్నారులు ఎంతో వేదనకు గురవుతున్నారు. ఎన్నో ఆశలతో ఏదో సాధించాలనే తపనతో కోరికను అణిచివేస్తున్నాయి. చివరకు కన్నవారి ఆశలను చిదిమేస్తూ, తమ కలలను కల్లలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నారాయణ కాలేజీల్లో ఒత్తిడిని భరించలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే! ఇప్పుడు మరో చిన్నారి.. ఇంటి నుంచి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ కాలేజీలను మూసేయాలంటూ ఆమె రాసిన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది!!
నారాయణ కాలేజీల్లో పిల్లలపై ఎంత ఒత్తిడిని గురిచేస్తున్నారో తెలిపేందుకు ఆ చిన్నారి రాసిన లేఖనే నిదర్శనంగా నిలుస్తోంది. ఎంతలా చిత్రహింసలు పెడతారో ఆ అక్షరాలే చెబుతాయి!! `నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి` అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రజ్వల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖలో రాసిన ప్రజ్వల.. కళాశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి ప్రజ్వల ఇంటి నుంచి కళాశాలకు అని చెప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. ఇళ్లను వదిలి పెట్టి వెళిపోతున్నా.. పోలీసులు మాత్రం యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి!!