మోడీషాల‌కు షాకిచ్చిన బీజేపీ అంత‌ర్గ‌త స‌ర్వే

Update: 2018-06-10 04:17 GMT
షాకింగ్ వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ దేశంలో ఏదైనా చెల్లుతుంది కానీ అహంకారం మాత్రం చెల్ల‌ద‌ని.. అదెంత మొన‌గాడ్ని అయినా కుర్చీ దింపేసేలా చేస్తుంద‌న్న వైనం మ‌రోసారి నిరూపిత‌మైంది. తిరుగులేని అధికారంతో ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చున్న న‌రేంద్ర‌మోడీ పాల‌న‌కు నాలుగేళ్లు పూర్తి అయ్యాయి.

మిత్రుల స‌హకారంతో 2014 ఎన్నిక‌ల్ని గ‌ట్టెక్కితే చాలు అనుకున్న స్థానే.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని సాధించి సంచ‌ల‌నం సృష్టించింది బీజేపీ. 282 సీట్ల సాధ‌న‌తో చ‌రిత్ర సృష్టించిన మోడీ స‌ర్కార్‌.. భారీ మెజార్టీ పుణ్య‌మా అని.. ఏ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికైనా పూర్తి అధికారాల్ని మోడీకి క‌ట్ట‌బెట్టేశారు దేశ ప్ర‌జ‌లు. మ‌రి.. నాలుగేళ్లు ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన మోడీ పాల‌న మీద దేశ ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు?  మ‌రో తొమ్మిది నెల‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎన్ని సీట్లు రానున్నాయి?  2014లో 282 స్థానాల్ని సొంతంగా సాధించిన బీజేపీ ఎన్ని స్థానాల్ని త‌న ఖాతాలో వేసుకోనుంది?  లాంటి సందేహాల‌కు స‌మాధానాల కోసం బీజేపీ సొంతంగా ఒక స‌ర్వేను నిర్వ‌హించింది.

ఆర్నెల్ల క్రితం చేయించుకున్న ఈ స‌ర్వే ఫ‌లితం మోడీషాల‌కు దిమ్మ తిరిగి పోయేలా ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. బీజేపీ సొంతంగా చేయించుకున్న స‌ర్వే ఫ‌లితాల్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ దైనిక్ జాగ‌ర‌ణ్ గ్రూపు తాజాగా రివీల్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి కేవ‌లం 130 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్న వైనాన్ని అంత‌ర్గ‌త స‌ర్వే వెల్ల‌డించిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ సొంతంగా చేయించుకున్న ఈ స‌ర్వే ఆర్నెల్ల క్రితం నాటిద‌ని.. గ‌డిచిన ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో మోడీ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోయిందే కానీ పెర‌గ‌లేద‌న్న వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు.

బీజేపీ అంత‌ర్గ‌తంగా చేయించుకున్న ఈ స‌ర్వే ఫ‌లితాలు చూసి బీజేపీ ఆగ్ర‌నాయ‌క‌త్వం కంగుతిన్న‌ట్లుగా చెబుతున్నారు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల దిశ‌గా ప్ర‌యాణం మొద‌లెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

దేశ ప్ర‌జ‌లు త‌మ‌కు వ్య‌తిరేకంగా మారిన‌ట్లుగా సొంత స‌ర్వే ఫ‌లితాలు తేల్చ‌టంతో.. న‌వ‌భార‌తం - యువ భార‌తం అన్న నినాదాన్ని తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2019 ఎన్నిక‌ల్లో యూత్‌కి పెద్ద ఎత్తున ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

బీజేపీ పుంజుకోవాలంటూ యువ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌న్న నిర్ణ‌యం వెనుక సంఘ్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. బీజేపీ పుంజుకోవాలంటూ యుత్ ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు వ‌చ్చేలా చేయాల‌ని.. మంత్రి మండ‌లిలోనూ ప్రాధాన్య‌త పెంచాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తేలింది.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్య‌తిరేక గాలి వీస్తున్న వైనాన్ని బీజేపీ గుర్తించి. 2014 ఎన్నిక‌ల్లో త‌మ‌కు తిరుగులేని మెజార్టీని క‌ట్ట‌బెట్ట‌టంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఈసారి అందుకు భిన్నంగా దెబ్బేయ‌నున్న‌ట్లుగా గుర్తించారు. ఇదే విష‌యం ఇటీవ‌ల వెల్ల‌డైన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీంతో.. ఉత్త‌రాదిని వ‌దిలేసి.. తాము అధికారంలో లేని ప‌శ్చిమ‌బెంగాల్‌.. తెలంగాణ‌.. ఏపీ.. ఒడిశా రాష్ట్రాల్లో వీలైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా పేర్కొన్నారు.  దీనికి త‌గ్గ‌ట్లే ఒడిశా.. ప‌శ్చిమ‌బెంగాల్ లో బీజేపీ బ‌ల‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే మోడీకి మ‌రింత ప్రాచుర్యం క‌ల్పించేందుకు వీలుగా వార‌ణాసి స్థానే పూరీ పుణ్య‌క్షేత్రాన్ని ఎంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏపీ.. తెలంగాణ‌లో ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకునే అవ‌కాశం లేద‌ని తేల్చిన తాజా స‌ర్వే కార‌ణంగా.. ఇప్పుడు సీట్ల సాధ‌న‌కు త‌మ‌కు అనువుగా ఉండే రాష్ట్రాలపై మ‌రింత శ్ర‌ద్ధ ప్ర‌ద‌ర్శించాల‌ని బీజేపీ భావిస్తోంద‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ.. తెలంగాణ‌.. గుజ‌రాత్.. అసోం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. గోవా.. జ‌మ్ముక‌శ్మీర్.. ప‌శ్చిమ బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాల్లో బీజేపీ 87 సీట్లు సాధించ‌గా.. ఈసారి ఆ సీట్లు ద‌క్కే విష‌యంలోనూ అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. సిట్టింగుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు ఈసారి ఎక్కువ స్థానాల్లో కొత్త ముఖాలు బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం అందంది.

రాష్ట్రాల వారీగా బీజేపీ కోల్పోయే సీట్ల‌కు సంబంధించి ఆ పార్టీ చేయించుకున్న అంత‌ర్గ‌త స‌ర్వే ఫ‌లితాలు చూస్తే..

రాష్ట్రం          2014లో సాధించిన ఎంపీలు        2019 ఎన్నిక‌ల్లో గెలిచే ఎంపీ సీట్లు

యూపీ                       71                                    48
రాజ‌స్థాన్                     25                                    13
మ‌ధ్య‌ప్ర‌దేశ్                  26                                    16
మ‌హారాష్ట్ర                    23                                    17
బిహార్                        22                                    12
జార్ఖండ్                      12                                    05
హ‌ర్యానా                     07                                    07
ఉత్త‌రాఖండ్                 05                                    03
పంజాబ్                      02                                    02
చండీగ‌ఢ్                     01                                    01
ఇత‌ర రాష్ట్రాలు              87                                    28


Tags:    

Similar News