దారుణం... కుటుంబంలో మూడు తరాల వారు ఒకేసారి మర్డర్..!
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో దీపావళి పర్వదినం వేళ ఓ దారుణం చోటు చేసుకొంది.
దీపావళి పండుగ వేళ ఓ దారుణం జరిగిపోయింది. పాత కక్షలు, అవమానకర వ్యాఖ్యలు కారణాలుగా చెబుతున్న వేళ... దీపావళి వేడుకల వేళ ఓ కుటుంబంలోని మూడు తరాల మగాళ్లు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయారు. కత్తులతో ప్రత్యర్థులు జరిపిన దాడులకు బలైపోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.
అవును... ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో దీపావళి పర్వదినం వేళ ఓ దారుణం చోటు చేసుకొంది. ఇందులో భాగంగా... కాజులూరు గ్రామంలో తలలు పగులగొట్టబడి, రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుల మూడు మృతదేహాలు కనిపించాయి! దీంతో... కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలం, సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ వ్యక్తులు కత్తులతో దాడి చేశారని అంటున్నారు. దీంతో.. బత్తుల కుటింబికులు మూడు తరాల వారు ఒకేసారి ముగ్గురు మృతి చెందారు.
ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ పోలీస్ అధికారి... ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. కుటుంబాల మధ్య చాలా కాలంగా వైరం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు!