ప్రతి ఏడాది సౌదీలోని మక్కా - మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాదిమంది ముస్లింలు తరలి వస్తుంటారు. భారత్ నుంచి కూడా లక్షలాది మంది ముస్లింలు ఈ యాత్రకు వెళ్లేందుకుగానూ ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించడం ఆనవాయితీ. అయితే, ముస్లింలకు సబ్సిడీ కల్పించినట్లే తమకు కూడా జెరూసలేం యాత్రకు సబ్సిడీ కల్పించాలని క్రైస్తవుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలో దేశంలోని ముస్లింలకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు అందించే సబ్సిడీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
భారత ముస్లిం యాత్రికులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీను ఎత్తివేస్తున్నట్లు నఖ్వీ ప్రకటించారు. మైనార్టీలను తృప్తి పరిచేందుకు అమలుచేస్తున్న కొన్ని తాత్కాలిక సబ్సిడీ పథకాలకు స్వస్తి చెప్పాలని, దేశంలోని ముస్లింలను మరింత పటిష్ఠం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. దేశంలోని మైనారిటీ బాలికల విద్యా, మహిళా సాధికారత కోసం హజ్ సబ్సిడీ నిధుల కోసం కేటాయించిన మొత్తాన్ని ఉపయోగిస్తామని నఖ్వీ ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 1.75 లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. తాజా ప్రకటన నేపథ్యంలో వారంతా సబ్సిడీ లేకుండానే హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది.