ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. తాను దేశ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నట్లు చెబుతుంటారు. మరి.. 134 కోట్ల మందిలో ఎవరైనా ఒక సామాన్యుడికి ఏదైనా కష్టం వస్తే అది ప్రధానమంత్రి దృష్టి వరకూ వెళుతుందా? అన్న ప్రశ్న వేసుకుంటే ఎలా సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ అనేస్తారు. కానీ.. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంటుంది ప్రధాని మోడీ తీరు చూస్తే.
సాదాసీదా వ్యక్తుల కష్టాలపై ప్రధానే స్వయంగా స్పందించటమే కాదు.. వారి కష్టాలకు పరిష్కారంగా వైద్యసదుపాయాలు.. ఆర్థిక సాయం లాంటివి అందిస్తున్న వైనం మోడీ ఇమేజ్ ను రోజురోజుకీ మరింత పెంచుతుందనే చెప్పాలి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ధూలే జిల్లా కేంద్రంలోని సాక్రి బోయ్ గల్లీలో కైలాస్ మోరే.. సింధుబాయి అనే భార్యభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇంతకీ వీరేం చేస్తారంటే.. తోపుడు బండి మీద పుట్నాలు.. గుగ్గిళ్లు లాంటి చిరుధాన్యాల్ని అమ్ముతుంటారు. భర్త ఈ వ్యాపారం చేస్తే.. భార్య సింధుబాయి కూలి పని చేస్తుంటుంది. ఇలాంటివేళ.. ఆమెకు మాయదారి క్యాన్సర్ వచ్చింది. సామాన్యులైన వీరికి వచ్చిన కష్టాన్ని చూసి కొందరు సాయం చేస్తూ ఆసుపత్రిలో చేర్చారు. అయితే.. వీరికి అందిన సాయం సరిపోని పరిస్థితి. ఆమె చికిత్సకు అవసరమైన రూ.6.3లక్షలకు అందిన సాయం తగ్గటంతో.. చివరకు వేరే మార్గం లేక సింధుబాయి పరిస్థితిని వివరిస్తూ ప్రధానికి ఒక లేఖ రాశారు. దీనికి స్పందించిన ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.1.75లక్షల మొత్తం టాటా మెమోరియల్ ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని నుంచి చెక్కు రావటంతో పాటు.. మోడీ సంతకంతో కూడిన లేఖ వచ్చింది. దీన్ని చూసిన ఆ నిరుపేద కుటుంబం తెగ సంతోషపడిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/