ప్రతీ ఆదివారం తన మనసులోని భావాలను ‘మన్ కీ బాత్’ పేరిట ప్రధాని నరేంద్రమోడీ బయటపెడుతుంటారు. ఆదివారం సెలవు కావడంతో ఈసారి కాస్త సరదాగా స్పందించారు. బోర్ కొట్టని టాపిక్ లను ఎంచుకున్నారు. గత ఆదివారం బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన మోడీ ఈసారి ‘కథలు - వాటి ప్రాధాన్యత’ల గురించి వివరించారు.
ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్స్ గురించి మోడీ ఈ ఆదివారం మాట్లాడారు. శ్రీకృష్ణ దేవరాయల గురించి బెంగళూరు స్టోరీ టెల్లర్ సొసైటీ ప్రతినిధులు అపర్ణ ఆత్రేయ - లావణ ప్రసాద్ తదితరులు కథా రూపంలో వివరించారు.తెనాలి రామకృష్ణ గురించి కూడా చెప్పారు.
వంకాయల రుచులు - భారతీయ వంటకాల్లో దానికి ఉన్న ప్రాధాన్యత గురించి కథగా వివరించారు. పౌష్టికాహార సమయంలో వంటకాల గురించి కథా రూపంలో తాను వినడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు.
కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇంట్లోనే ఉండి ఈ కథలు - పూర్వీకుల గురించి తెలుసుకున్నారన్నారు. కుటుంబ అనుబంధాలు లాక్ డౌన్ తో పెరిగాయన్నారు.
కథలు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయని.. వారి కాల్పనిక శక్తిని రెట్టింపు చేస్తాయని మోడీ అన్నారు. కథలు చెప్పుకోవడం వల్ల తెలియని ఓ నూతన ఉత్తేజం వస్తుందని వివరించారు. కథలపై పూర్తి సమాచారాన్ని తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తానని మోడీ చెప్పుకొచ్చాడు.