సుదీర్ఘ కాలంగా చర్చల్లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం తమిళనాడు సహా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. “దేవుడు శాసించాడు… పాటిస్తాను..“ అని ప్రకటించడంతో ఒకటే కలకలం. రాజకీయాల్లోకి వస్తే వెన్ను చూపించేది లేదని అన్నాడు. దేశరాజకీయాలకు పట్టిన భృష్టును వదిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పుకుంటే పిరికివాడంటారు అందుకే పోరాటానికే నిర్ణయించుకున్నానని రజనీ ప్రకటించారు. రజనీ ప్రకటనతో పలువురి గుండెలు గుబేల్ మంటున్నాయ్. రజనీ వస్తే తదుపరి సన్నివేశంపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.
రజనీ ఎంట్రీ కేవలం తమిళనాడు పాలిటిక్స్ కు మాత్రమే పరిమితమైన అంశంగా ఏ ఒక్కరూ చూడని సంగతి అందరికీ తెలిసిందే. దేశం మొత్తం రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చించుకుంటోంది. ఊరూ వాడా తమిళనాడు రాజకీయాల గురించే చర్చ సాగుతోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ - సుబ్రమణ్య స్వామి - టీటీవీ దినకరన్ వంటి ప్రముఖులు రజనీ రాజకీయార అరంగేట్రంపై స్పందించారు. ఎవరికి వారు తమ స్పందనలు తెలియజేశారు. కోలీవుడ్ ప్రముఖులు సహా పలువురు రాజకీయనాయకులు రజనీ ఆరంగేట్రంపై ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో రజనీ ఫీవర్ ఓ రేంజులో ఉందని వార్తకథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొత్తంగా ఈ కీలక ఎపిసోడ్ విషయంలో కిమ్మనకుండా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
సూపర్ స్టార్ ఎంట్రీ విషయంలో ఇంతవరకూ దేశ ప్రధాని నుంచి ఎలాంటి విషెస్ అందకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అధికారిక పీఎంవో ట్విట్టర్ ఖాతాలో ప్రతిదానికి స్పందన కనిపిస్తున్నా రజనీపై మాత్రం ఇంతవరకూ స్పందన కనిపించనేలేదు. సొంతంగా కొత్త పార్టీ ప్రారంభించేందుకు రజనీ సిద్ధమవుతున్న వేళ ప్రధాని ఇలా చేశారా? అసలు రజనీ రాజకీయ అరంగేట్రంపై పీఎం స్పందించకపోవడం, కనీసం శుభాకాంక్షలు తెలపకపోవడమేంటా? అంటూ అందరిలోనూ ఒకటే సందేహం. ఎందు ప‌్రధాని మోడీ పట్టించుకోలేదేం? అక్కడ తమిళనాడు కాలుతున్నా...రజనీ పొలిటికల్ ఎంట్రీ మోడీని కదిలించలేదా? పీఎంవో సైట్ లో అన్నీ వేరే అప్‌డేట్స్ కనిపించడానికి కారణమేంటి? కనీసం ప్రధాని శుభకాంక్షలు అయినా చెప్పరా? అంటూ రజనీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
రజనీకాంత్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ఇటీవలి కాలంలో ప్రధాని స్థాయిలో చర్చ సాగేది. రజనీని ఏదోలా భాజపాలో కలిపేసుకోవాలని చాలానే ప్లానింగ్ నడిచింది. చివరికి రజనీ భాజపాకి హ్యాండిస్తున్నారనే తాజా సన్నివేశం చెబుతోందని అందుకే...ప్రధాన మౌనం పాటిస్తున్నారని అంటున్నారు.