భారత్ లో అతి పెద్ద స్టేడియాలే కాదు..అతిపెద్ద ఆరోగ్య పథకాలు ఉన్నాయ్

Update: 2020-02-24 10:53 GMT
అమెరికా ప్రెసిడెంట్ భారత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన  నమస్తే ట్రంప్ సభలో మోడీ - ట్రంప్ ఒకరి పై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద స్టేడియంలో సభ ఏర్పాటు చేసి - అమెరికా పట్ల ఇండియన్స్ ప్రేమను చాటుకొన్నారని ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా చెప్పగా - ఆ విషయం పై  మోడీ మాట్లాడుతూ .. తమ వద్ద అతి పెద్ద స్టేడియలే కాదు అతి పెద్ద ఆరోగ్య పథకాలు కూడా ఉన్నాయని కంటిన్యూ చేశారు. ఒకేసారి ఎక్కువ రాకెట్లను పంపించి రికార్డు సృష్టిస్తున్నామని,  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాజ్యం కూడా భారత్ అని తెలిపారు.

ఈ దేశంలో అతి పెద్ద స్టేడియాలే కాదు.. అత్యంత పెద్ద ఆరోగ్య పథకాలు కూడా ఉన్నాయని - ప్రపంచంలోనే పెద్దదైన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ దేశంలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా  తెలిపారు. నవ భారత దేశాన్ని నిర్మించేందుకు 130 కోట్ల మంది భారతీయులు శ్రమిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. తమ దేశాభివృద్ధి కోసం యువత అవిశ్రాంతంగా శ్రమిస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారని , వారి ఆకాంక్షల మేరకు లక్ష్యాలను చేరుకుంటామని మోడీ తెలిపారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి గర్వపడుతారని, ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసి గర్వపడతారు అని ప్రధాని మోడీ తెలిపారు. అమెరకా స్వేచ్చ భూమి అయితే భారత్ ఐకమత్యంతో కలిసి ఉండే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని - ట్రంప్ కుటుంబంతో సహా భారత్ పర్యటనకి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
Tags:    

Similar News